ఎరువుల దుకాణాల్లో తనిఖీలు
ABN , Publish Date - Jul 04 , 2026 | 12:22 AM
పట్టణంలోని ఎరువుల దుకా ణాలపై వ్యవసాయ అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వ హించారు.
కోడుమూరు, జూలై 3(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఎరువుల దుకా ణాలపై వ్యవసాయ అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వ హించారు. జిల్లాలోని ఇంటర్నల్ స్వ్కాడ్ బృందం పత్తికొండ ఏడీఏ మోహన్ విజయ్‌కుమార్, టెక్నికల్ ఏవో దాసరి మునెమ్మ, మండల వ్యవసాయ అధికారి రవిప్రకాష్ ఈ తనిఖీలో పాల్గొన్నారు. ఆయా ఎరు వుల దుకాణం లోని స్టాక్‌ను పరిశీలించి, రికార్డులను తనిఖీ చేశారు. ఏవో రవిప్రకాష్ మాట్లాడుతూ ఏప్రిల్, మే మాసంలో యూరియా ఎక్కువ అమ్మకాలు జరిగినట్లు రికార్డులు చూపుతున్నాయన్నారు. అయితే ఇందులో ఏమైన అక్ర మాలు జరిగాయా అనే కోణంలో దుకా ణాల రికార్డులను పరిశీలించామన్నా రు. ఎరువుల అమ్మకాల్లో అక్రమా లు జరిగేతే సహించేది లేదని చెప్పారు.