వాటర్ షెడ్ పనుల పరిశీలన
ABN , Publish Date - Apr 16 , 2026 | 11:34 PM
మండలంలోని ఉంగరాని గుండ్ల గ్రామ పరిసరాల్లో జరిగిన వాటర్‌షెడ్ అభివృద్ధి పనులను కలెక్టర్ రాజకుమారి గురువారం పరిశీలించారు.
డోన్ రూరల్, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఉంగరాని గుండ్ల గ్రామ పరిసరాల్లో జరిగిన వాటర్‌షెడ్ అభివృద్ధి పనులను కలెక్టర్ రాజకుమారి గురువారం పరిశీలించారు. మండలంలోని ఎద్దుపెంట, మిద్దె పల్లె, యాపదిన్నె, ఉంగరానిగుండ్ల గ్రామ పరిసరాల్లో రూ.2లక్షల నిధులతో వాటర్‌షెడ్ పనులు చేపట్టారు. ఇందులో భాగంగా కలెక్టర్ ఉంగరానిగుండ్ల గ్రామాన్ని ఎంపిక చేసుకుని ఆ గ్రామ పరిసరాల్లో జరిగిన అభివృద్ధి పనులను పరిశీలన చేశారు. గ్రామ పరిసరాల్లో ఉన్న వంకలలో, కుంటలు, చెక్‌డ్యామ్‌లను పరిశీలించారు. సంబంధిత అధికారు లను వివరాలు అడిగి సూచనలు చేశారు. గ్రామంలో రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటర్ షెడ్ అభివృద్ధి పనుల్లో భాగంగా భూగర్భజలాలు పెరిగి నీటి నిల్వలు పెరగడం వల్ల ప్రజలకు, రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని కలెక్టర్ చెప్పారు. కార్యక్రమంలో డోన్ ఆర్డీవో నరసింహులు, ఎంపీడీవో వెంకటేశ్వరరెడ్డి, వాటర్‌షెడ్ అభివృద్ధి అధికారి విజేత, టీడీపీ నాయకులు చిన్నమద్ది పాల్గొన్నారు.