Share News

తాత్కాలిక భవనాల పరిశీలన

ABN , Publish Date - May 18 , 2026 | 11:27 PM

పట్టణంలోని కోర్టుల నిర్వహణకు సంబంధించి అవసరమైన తాత్కాలిక భవనాలను సోమవారం జిల్లా న్యాయాధికారి కబర్ధి పరిశీలించారు.

తాత్కాలిక భవనాల పరిశీలన
క్రీడా వికాస కేంద్రాన్ని పరిశీలిస్తున్న జిల్లా న్యాయాధికారి కబర్ధి

ఆత్మకూరు, మే 18 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని కోర్టుల నిర్వహణకు సంబంధించి అవసరమైన తాత్కాలిక భవనాలను సోమవారం జిల్లా న్యాయాధికారి కబర్ధి పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న భవనాలు శిథిలం కావడంతో ఆ భవనాలన్నీ కూల్చి వేసి కొత్తభవనాలను నిర్మించాలని నిర్ణయించారు. అప్పటివరకు కోర్టుల నిర్వహణను తాత్కా లిక భవనాల్లో నిర్వహించాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆత్మకూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఉన్న క్రీడా వికాస కేంద్రంలో కోర్టుల నిర్వహణ చేపట్టాలని నిర్ణయించగా వాటిని కబర్ధి పరిశీలించారు. కోర్టుల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై అంచనాలను తయారు చేయాలని అర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. స్థానిక న్యాయవాదులతో మాట్లాడి సలహాలు, సూచనలను స్వీకరించారు. ఈయన వెంట జూనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయవాధికారి రాహుల్‌ అంబేడ్కర్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు బొల్లు నగేష్‌, గరుడాద్రి సుదర్శన్‌, సీనియర్‌ న్యాయవాదులు కంచర్ల గోవిందరెడ్డి, గిరిరాజు, కేశవరెడ్డి ఉన్నారు.

Updated Date - May 18 , 2026 | 11:27 PM