సబ్ జైలు తనిఖీ
ABN , Publish Date - Jan 30 , 2026 | 11:23 PM
ఆళ్లగడ్డ పట్టణంలోని సబ్ జైలును ఐదో అదనపు జిల్లా న్యాయాధికారి అమ్మన్నరాజా శుక్రవారం అకస్మికంగా తనిఖీ చేశారు.
ఆళ్లగడ్డ జనవరి 30(ఆంధ్రజ్యోతి): ఆళ్లగడ్డ పట్టణంలోని సబ్ జైలును ఐదో అదనపు జిల్లా న్యాయాధికారి అమ్మన్నరాజా శుక్రవారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన సబ్ జైలులోని వివిధ రికార్డులను పరిశీలించారు. అనంతరం జైలులోని ఖైదీలతో సమావేశం నిర్వహించారు. జైలులో అందుతున్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. న్యాయపరమైన సమస్యలను తెలియజేస్తే, వాటి పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్యానెల్ అడ్వకేట్ షహీనా బేగం, షేక్ బాబు, సబ్ జైలు అధికారులు పాల్గొన్నారు.