Share News

అటవీ భూముల పరిశీలన

ABN , Publish Date - May 02 , 2026 | 10:39 PM

కొంత కాలంగా అటవీ భూములపై జరుగుతున్న వివాదానికి తెరపడింది. శనివారం జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌ ఆ భూములను పరిశీలించారు.

అటవీ భూముల పరిశీలన

ఓర్వకల్లు, మే 2 (ఆంధ్రజ్యోతి): కొంత కాలంగా అటవీ భూములపై జరుగుతున్న వివాదానికి తెరపడింది. శనివారం జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌ ఆ భూములను పరిశీలించారు. మండలంలోని బ్రాహ్మణపల్లె గ్రామ సమీపాన సోలార్‌ పార్‌కు కేటాయించిన ప్రభుత్వ భూమి ఫారెస్టు భూమి అని ఫారెస్టు అధికారులు తెలపడంతో కొంత కాలంగా జిల్లా స్థాయి అధికారులు ఆ పొలాలను సర్వే చేసి కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ ఆ భూములు ఫారెస్టుకు సంబంధించినవని నిర్ధారించడంతో ఆ భూములను జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌, ఆర్డీవో సందీప్‌ కుమార్‌, ఫారెస్టు అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ సర్వేలో ఆ భూమి ఫారెస్టు విభాగానిదని తేలిందని, కమిటీ కూడా ఫారెస్టు భూమి అని నిర్ధారించడంతో సోలార్‌ పార్కుకు కేటాయించిన ఆ భూమి బదులుగా ఉయ్యాలవాడ గ్రామ సమీపంలోని ఎల్‌పీ నెంబర్‌.438, సర్వే.నెంబర్‌ 725లో 63 హెక్టార్లు అటవీ శాఖకు కేటాయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ విద్యాసాగర్‌, సోలార్‌ అసిస్టెంట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీనివాసనాయుడు, సర్వేయర్‌ శంకర్‌ మాణిక్యం, వీఆర్వో జనార్దన్‌, ఫారెస్టు, సోలార్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2026 | 10:39 PM