ఎరువుల దుకాణాల తనిఖీ
ABN , Publish Date - May 16 , 2026 | 12:19 AM
ఆదోని నియోజక వర్గంలోని ఎరువులు, విత్తన దుకాణాలను వ్యవసాయ శాఖ అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు.
రూ. 11.26 లక్షల విలువైన పత్తి విత్తన అమ్మకాలు నిలుపుదల
ఆదోని అగ్రికల్చర్, మే 15 (ఆంధ్రజ్యోతి): ఆదోని నియోజక వర్గంలోని ఎరువులు, విత్తన దుకాణాలను వ్యవసాయ శాఖ అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆదోని వ్యవసాయ సహాయ సంచాల కుడు బాలవర్దిని రాజు, ఏవో సుధాకర్ పట్టణంలోని శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఫర్టిలైజర్ దుకాణంలో రూ.9,99,840, పెద్ద హరివాణం శ్రీ లక్ష్మినారాయణ ఆగ్రో ట్రేడర్స్ దుకాణంలో రూ. 1,27,014 విలువగల అమ్మకాలను సంబంధించిన సోర్స్ సర్టిఫికెట్ లేకపోవడంతో తాత్కాలి కంగా పత్తి విత్తనాల అమ్మకాలను నిలుపుదన చేశారు. అధికా రులు మాట్లాడుతూ విత్తనాల విక్రయాలు జరిగేటప్పుడు తప్పనిసరిగా సరైన బిల్లులు సోర్స్ సర్టిఫికేట్ ఇన్వాయిసులతో నిర్వహించాలన్నారు. నిబంధన లు తప్పకుండా విత్తనాలు కొనేటప్పుడు బిల్లు పొందాలని సూచించారు. అనంతరం పట్టణంలోని వివిధ పరిశ్రమలలో ఇండస్ట్రియల్ అఽధికారి నూర్ అహ్మద్ లేబర్ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి తనఖీ చేశారు. పరిశ్రమల్లో యూరియా వినియోగంపై ఆరా తీశారు.