Share News

ఎనర్జీ ఆడిట్‌ పనుల పరిశీలన

ABN , Publish Date - Jul 04 , 2026 | 12:21 AM

జిల్లాలో వంద శాతం ఎనర్జీ ఆడిట్‌ చేయడానికి ఆటోనగర్‌ ఫీడర్‌ను ఎంపిక చేసినట్లు కర్నూలు జిల్లా విద్యుతశాఖ నోడల్‌ ఆఫీసర్‌ ఆర్‌.పద్మ తెలిపారు.

ఎనర్జీ ఆడిట్‌ పనుల పరిశీలన
అధికారులతో మాట్లాడుతున్న అధికారి పద్మ

కల్లూరు, జూలై 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వంద శాతం ఎనర్జీ ఆడిట్‌ చేయడానికి ఆటోనగర్‌ ఫీడర్‌ను ఎంపిక చేసినట్లు కర్నూలు జిల్లా విద్యుతశాఖ నోడల్‌ ఆఫీసర్‌ ఆర్‌.పద్మ తెలిపారు. ఏపీ ఎస్పీ డీసీఎల్‌ సీఎండీ ఆదేశాల మేరకు కర్నూలు బళ్లారిరోడ్‌ సెక్షన పరిఽ దిలోని ఆటోనగర్‌లో 11కేవీ ఫీడర్‌ ఏర్పాటు చేయనున్నామని ఆమె తెలిపారు. అందులో భాగంగా శుక్రవారం వందశాతం ఎనర్జీ ఆడిట్‌ పనులను ఎస్‌ఈ ప్రదీప్‌కుమార్‌తో కలిసి నోడల్‌ ఆపీసర్‌ పద్మ పరిశీలించారు. ఆటోనగర్‌ ఫీడర్‌లోని అన్ని ట్రాన్సఫార్మర్లకు, అన్ని సర్వీసులకు స్మార్ట్‌ మీటర్లను బిగించి కచ్చితమైన ఎనర్జీ ఆడిట్‌ చేయ డానికి కావలసిన పనులను ఆమె పర్యవేక్షించారు. అన్ని సర్వీసు లను, అన్ని ట్రాన్సఫార్మర్లను కరెక్టుగా మ్యాపింగ్‌ చేయాలని వంద శాతం ఎన్నోవేషన్ను ప్రారంబించారు. కార్యక్రమంలో కర్నూలు టౌన ఈఈ టి.శేషాద్రి, కనస్ట్రక్షన ఈఈ భాస్కర్‌రావు, డీఈఈ నాగప్ర సాద్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 04 , 2026 | 12:21 AM