Share News

సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన

ABN , Publish Date - Jul 21 , 2026 | 11:31 PM

మండల కేంద్రమైన ఆస్పరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈనెల 25న ‘సంజీవని’ని సీఎం చంద్ర బాబునాయుడు ప్రారంభించనుండటంతో ఆయన పర్యటన ఏర్పాట్లను మంగళవారం ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి, జోనల్‌ కోఆర్డినేటర్‌ పాలకూరు శ్రీనివాసరెడ్డి పరిశీలించారు.

సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
సీఎం హెలిప్యాడ్‌ ప్రదేశాన్ని పరిశీలిస్తున్న జోనల్‌ కో ఆర్డినేటర్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి

ఆస్పరి, జూలై 21 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రమైన ఆస్పరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈనెల 25న ‘సంజీవని’ని సీఎం చంద్ర బాబునాయుడు ప్రారంభించనుండటంతో ఆయన పర్యటన ఏర్పాట్లను మంగళవారం ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి, జోనల్‌ కోఆర్డినేటర్‌ పాలకూరు శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. హెలిప్యాడ్‌, బహిరంగ సభ కార్యకర్తల సమావేశ వేదిక, ఆస్పత్రిలో ఆధునికీకరణ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. వీరివెంట మాజీ ఎంపీపీ కృష్ణయాదవ్‌, మండల కన్వీనర్‌ గోవిందు, సొసైటీ డైరెక్టర్‌ మల్లికార్జున, రాజ్‌కుమార్‌, రాఘవేంద్ర, సుదర్శన్‌, జీవన్‌కుమార్‌, కృష్ణ, ఉచ్చీరప్ప, సాలీసాహెబ్‌ పాల్గొన్నారు.

రచ్చబండకు ఏర్పాట్లు

సీఎం నారా చంద్రబాబునాయుడు ‘సంజీవని’ ప్రారంభోత్సవం అనం తరం మహిళలతో రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీపీవో (జిల్లా పంచాయతీ అధికారి) భాస్కర్‌ తెలిపారు. ఆర్డీవో ఓబులేసు, డీఆర్‌డీఏ పీడీ శ్రీధర్‌తో కలిసి డీపీవో పోలీసుస్టేషన్‌ ఎదుట స్థలాన్ని పరిశీలించారు. అనంతరం భాస్కర్‌ ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శులతో మాట్లాడారు. గ్రామంలో అపరిశుభ్రత లేకుండా చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేయించాలన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద శుభ్రం చేయించాలన్నారు. ఎంపీడీవో గీతావాణి, తహసీల్దార్‌ మల్లికార్జునరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 21 , 2026 | 11:31 PM