పట్టణ నిరాశ్రయుల వసతి గృహం తనిఖీ
ABN , Publish Date - Apr 24 , 2026 | 12:43 AM
స్థానిక మద్దూరునగర్, అశోక్‌నగర్‌లో ఉన్న పట్టణ నిరాశ్రయుల వసతి గృహాలను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి గురువారం తనిఖీ చేశారు.
కర్నూలు లీగల్, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): స్థానిక మద్దూరునగర్, అశోక్‌నగర్‌లో ఉన్న పట్టణ నిరాశ్రయుల వసతి గృహాలను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి గురువారం తనిఖీ చేశారు. అక్కడుంటున్న వృద్దులతో మాట్లాడుతూ ప్రభుత్వం వృద్దుల సంక్షేమం కోసం పలు చట్టాలు చేసిందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వృద్దుల సమస్యలు ఏమైనా ఉంటే న్యాయ సేవాధికార సంస్థ హెల్ప్‌లైన్ నెంబర్.15100కు కాల్ చేయాలని కోరారు. ఆయన వృద్దాశ్రమాలకు సంబంధించిన రికార్డులను అక్కడుంటున్న వారికి అందిస్తున్న వసతి, భోజన వైద్యసదుపాయాల గురించి అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వసతి గృహాల లీగల్ ఎయిడ్ క్లీనిక్ న్యాయవాది రాంపుల్లయ్య, వేదాస్ వసతి గృహ నిర్వహకురాలు పరమేశ్వరి తదితరులు పాల్గొన్నారు.