Share News

ఇన్‌ సర్వీసు పీజీలు విధులకు హాజరు కావాల్సిందే

ABN , Publish Date - Aug 14 , 2026 | 12:05 AM

: జూనియర్‌ డాక్టర్లు చేపట్టే సమ్మెలో పాల్గొనకుండా ఇన్‌ సర్వీసు పీజీ వైద్యులు విధులకు హాజరు కావాల్సిందేనని కర్నూలు జీజీహెచ్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డా.కె.వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.

ఇన్‌ సర్వీసు పీజీలు విధులకు హాజరు కావాల్సిందే
న్యూరో సర్జరీ వార్డును తనిఖీ చేస్తున్న సూపరింటెండెంట్‌

కర్నూలు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ వెంకటేశ్వర్లు

కర్నూలు హాస్పిటల్‌, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): జూనియర్‌ డాక్టర్లు చేపట్టే సమ్మెలో పాల్గొనకుండా ఇన్‌ సర్వీసు పీజీ వైద్యులు విధులకు హాజరు కావాల్సిందేనని కర్నూలు జీజీహెచ్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డా.కె.వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. గురువారం ఆయన హాస్పిటల్‌లోని స్పెషాలిటీ బ్లాక్‌, ఆపరేషన్‌ థియేటర్లు, ఐసీయూ వార్డులను తనిఖీ చేశారు. సమ్మె వల్ల వార్డులో రోగులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఇంజెక్షన్‌లు వేయడం, శాంపిళ్లు సేకరించి ల్యాబ్‌లకు పంపించే బాధ్యతలను స్టాఫ్‌ నర్సులు తాత్కాలికంగా నిర్వహించాలని సూపరింటెండెంట్‌ ఆదేశించారు. అలాగే స్టేట్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ముగ్గురు అనస్థీషియా వైద్యులను కర్నూలు జీజీహెచ్‌కు నియమించామని చెప్పారు. హాస్పిటల్‌లో ఉన్న సీఎ్‌సఆర్‌ఎంవో, డిప్యూటీ సీఎ్‌సఆర్‌ఎంవో, ఆర్‌ఎంవో, అడ్మినిస్ర్టేషన్‌ విభాగపు వైద్యులు, హాస్పిటల్‌ అడ్మినిస్ర్టేటర్‌ అందరూ ఓపీ విభాగాలు, ఓపీ కౌంటర్లు, రద్దీ ఉన్న ప్రాంతాలు, న్యూడయాగ్నోస్టిక్‌ సెంటర్‌ను పరిశీలించి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.

Updated Date - Aug 14 , 2026 | 12:05 AM