Share News

ఎస్సార్బీసీ రైతులకు అన్యాయం చేస్తున్నారు

ABN , Publish Date - Aug 18 , 2026 | 11:05 PM

ఎస్సార్బీసీ ఆయకట్టు రైతులకు అధికారులు అన్యాయం చేస్తున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడి ్డ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎస్సార్బీసీ రైతులకు అన్యాయం చేస్తున్నారు
అధికారులతో మాట్లాడుతున్న కాటసాని రాంభూపాల్‌రెడ్డి

గోరుకల్లు రిజర్వాయర్‌ నుంచి నీటి విడుదలకు కాటసాని యత్నం

అడ్డుకున్న పోలీసులు.. గోరుకల్లు వద్ద హైటెన్షన్‌

పాణ్యం, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): ఎస్సార్బీసీ ఆయకట్టు రైతులకు అధికారులు అన్యాయం చేస్తున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడి ్డ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం రైతుల ఆధ్వర్యంలో గోరుకల్లు రిజర్వాయర్‌ నుంచి నీటి విడుదలకు యత్నంచడంతో పెద్ద ఎత్తున పోలీసులు మెహరించి బారికేడ్లు అడ్డుపెట్టి అడ్డుకున్నారు. దీంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. కాటసాని మాట్లాడుతూ ఎస్సార్బీసీ ఆయకట్టు కింద పాణ్యం, బనగానపల్లె, కోవెలకుంట్ల, తదితర మండలాలలో లక్షలాది ఎకరాలు పంటలు సాగయ్యాయని, ఈ సమయంలో గోరుకల్లులో ఉన్న 6 టీఎంసీల నీటిని ఎస్సార్బీసీ ద్వారా విడుదల చేయాల్సిన అధికారులు ఆయకట్టు లేని గాలేరు నగరి, కుందూకు ఎందుకు విడుదల చేశారని ప్రశ్నించారు. ఇప్పటికే పాణ్యం మండలంలో వేలాది ఎకరాలు సాగయ్యాయని, వర్షాలు లేక బోర్లు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఎస్సార్బీసీకి నీరు వదిలితే పాణ్యం, ఆలమూరు, భూపనపాడు, వడ్డుగండ్ల తదితర చెరువులు నింపుకొనే అవకాశం ఉంటుందన్నారు. దీనిపై కలెక్టరును కలిసి వివరిస్తామని పేర్కొన్నారు. రెండు రోజుల్లో ఎస్సార్బీసీకి నీటిని వదలుతామని అఽధికారులు పేర్కొనడంతో కాటసాని, రైతులు వెనక్కి వెళ్లారు. పాణ్యం సీఐ కిరణ్‌కుమార్‌రెడ్డి, నంద్యాల రూరల్‌ సీఐ శ్రీనివాసరెడ్డి, నంద్యాల ట్రాఫిక్‌ సీఐ సుబ్రహ్మణ్యం, గడివేముల ఎస్‌ఐ నాగార్జునరెడ్డి, మహానంది ఎస్‌ఐ రాంమోహన్‌రెడ్డి పోలీసు, ఎస్సార్బీసీ సిబ్బంది ఉన్నారు.

Updated Date - Aug 18 , 2026 | 11:05 PM