విద్వేషాలు రెచ్చగొట్టేందుకే దీక్షలు
ABN , Publish Date - Feb 05 , 2026 | 11:27 PM
రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టేందుకే వైసీపీ నాయకులు పోతిరెడ్డి పాడు వద్ద దీక్షలు చేస్తున్నారని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి విమర్శించారు.
రాయలసీమ ప్రాజెక్టుపై చర్చకు రండి
ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
బనగానపల్లె, ఫిబ్రవరి 5 (ఆంఽధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టేందుకే వైసీపీ నాయకులు పోతిరెడ్డి పాడు వద్ద దీక్షలు చేస్తున్నారని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి విమర్శించారు. గురువారం మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో జగన్ రాయలసీమను పూర్తి నిర్లక్ష్యం చేశారన్నారు. నాడు నిర్లక్ష్యం చేసి నేడు దీక్షల పేరిట వైసీపీ నాయకులు డ్రామాలాడుతున్నారని విమర్శించారు. 2020లో రాయలసీమ లిప్ట్ ఆగితే జగన్ ఎందుకు పట్టించుకోలేదని మంత్రి ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో సాగునీటి కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో చివరి ఆయకట్టు వరకు పుష్కలంగా నీరు అందిస్తోందన్నారు. రైతులు సంతోషంగా పంటలు పండించుకుంటున్నారన్నారు. అసెంబ్లీ సాక్షిగా రాయలసీమ ప్రాజెక్టులపై చర్చిద్దామని వైసీపీ ఎమ్మెల్యేలకు సవాల్ విసిరారు.