Share News

సంస్కరణలకు శ్రీకారం

ABN , Publish Date - Mar 21 , 2026 | 11:43 PM

పంచాయతీ రాజ్‌ వ్యవస్థలో సమూల మార్పులు, సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పల్లెసీమల ప్రగతికి పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.

సంస్కరణలకు శ్రీకారం

పల్లెసీమల ప్రగతికి పక్కా ప్రణాళికలు

నాలుగు గ్రేడ్లుగా పంచాయతీల పునర్విభజన

పది వేలకు పైగా జనాభా రూర్బన్‌ పంచాయతీలు

నూతన విధానంలో ప్రతి పంచాయతీకి కార్యదర్శి

కొత్తగా 34 పంచాయతీల ఏర్పాటుకు ప్రతిపాదనలు

పంచాయతీ రాజ్‌ వ్యవస్థలో సమూల మార్పులు, సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పల్లెసీమల ప్రగతికి పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. క్లస్టర్‌ వ్యవస్థను రద్దుచేసి స్వతంత్ర గ్రామ పంచాయతీలు ఏర్పాటుచేస్తున్నారు. వీటి బలోపేతానికి జనాభా ప్రాతి పదికన నాలుగు కేటగిరీల్లో పంచాయతీల పునర్విభజన (రీ కేటరిరైజేషన్‌) చేపట్టారు. పది వేలకు పైగా జనాభా కలిగిన మేజర్‌ పంచాయతీలను రూర్బన్‌ పంచాయతీలుగా మారుస్తున్నారు. పల్లెసీమల్లో పట్టణ స్థాయి సదుపాయాల కల్పనే విభజన ప్రధాన లక్ష్యం. జిల్లాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జిల్లాలో రూ.కోటికి పైగా ఆదాయం, పది వేలకు పైగా జనాభా కలిగిన 19 పంచాయతీలను రూర్బన్‌ పంచాయతీలుగా మార్చారు. మున్సిపాలిటీ తరహాలో స్వతంత్రంగా వ్యవహరించే అవకాశముంది. జిల్లాలో 34 నూతన పంచాయతీల ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఆ వివరాలపై

‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.

కర్నూలు, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, పత్తికొండ, ఆలూరు, పాణ్యం నియోజకవార్గల్లోని 26 మండలాల్లో 484 గ్రామ పంచాయతీలున్నాయి. ప్రస్తుతం క్లస్టర్‌ విధానంలో రెండు, మూడు గ్రామ పంచాయతీల బాధ్యతలు ఒక కార్యదర్శి నిర్వహిస్తున్నారు. ఈ విధానంతో పల్లెసీమల్లో ప్రగతి పనులు పర్యవేక్షణ, మౌలిక వసతుల కల్పన, మెరుగైన సేవలు అందని ద్రాక్షగా మారింది. క్లస్టర్‌ విధానంలోనూ ఇబ్బందులు ఉన్నాయని కూటమి ప్రభుత్వం గుర్తించింది. పంచాయతీ పాలనలో సంస్కరణలు తీసుకురావాలని సీఎం చంద్రబాబు సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పంచాయతీరాజ్‌, గ్రామాభివృద్ధి శాఖ బాధ్యతలు చూస్తున్న డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ పల్లెసీమల్లో పట్టణ స్థాయి సదుపాయాలు కల్పించారు.

19 రూర్బన్‌ పంచాయతీలు

నిబంధనల ప్రకారం పది వేలకు పైగా జనాభా, రూ.కోటి ఆదాయం కలిగిన 19 గ్రామ పంచాయతీలను రూర్బన్‌ పంచాయతీలుగా ఏర్పాటుచేశారు. మండిగిరి, ఆలూరు, పోలకల్లు, గోనేగండ్ల, హొళగుంద, కోడుమూరు, కోసిగి, కౌతాళం, బి. తాండ్రపాడు, దిన్నెదేవరపాడు, పసుపుల, మద్దికెర, మంత్రాలయం, నందవరం, నన్నూరు, పత్తికొండ, వెల్దుర్తి, గుడేకల్లు, కడిమెట్ల గ్రామ పంచాయతీలను రూర్బన్‌ పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. వీటికి డిప్యూటీ ఎంపీడీవో క్యాడర్‌ స్థాయి అధికారిని కార్యదర్శిగా నియమించే అవకాశం ఉంది.

రూ.కోటి కంటే తక్కువ ఆదాయం ఉన్న..

రూ.కోటి ఆదాయం కంటే తక్కువ ఉన్న హలహర్వి, ఆస్పరి, చిప్పగిరి, పెద్దకడబూరు, తుగ్గలి, దేవనకొండ, కృష్ణగిరి, ఓర్వకల్లు వంటి మండల కేంద్రాలు గ్రేడ్‌-1 గ్రామ పంచాయతీల జాబితాలో ఉన్నాయి. 3-10 వేల మధ్య జనాభా, ఏటా రూ.30 లక్షలకు పైగా ఆదాయం కలిగిన 140 గ్రామ పంచాయతీలను గ్రేడ్‌-1, 2-3 వేలు మధ్య జనాభా కలిగిన 134 పంచాయతీలను గ్రేడ్‌-2గా, 2 వేలు కంటే తక్కువ జనాభా కలిగిన 191 గ్రామ పంచాయతీలను గ్రేడ్‌-3 పంచాయతీలుగా విభజించి జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు.

ప్రభుత్వానికి ప్రతిపాదనలు

జిల్లాలో 34 నూతన పంచాయతీలు ఏర్పాటుకు జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ప్రస్తుతం జగగణన కార్యక్రమం జరుగుతుంది. 2027 మార్చి వరకు పంచాయతీల సరిహద్దులు మార్చే అవకాశం ఉండకపోవచ్చని అధికారులు అంటున్నారు. ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయని సీఎం చంద్రబాబు ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ముందుగా జిల్లా, మండల పరిషత్తు, మున్సిపాలిటీల ఎన్నికలు నిర్వహించి ఆ తరువాత పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే, మార్చి తరువాతే పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అదే జరిగితే గ్రామ పంచాయతీల పునర్విభజన జరిగి కొత్త పంచాయతీలు ఏర్పాటయ్యే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు.

జనాభా ప్రాతిపదికన..

జిల్లాలో 484 గ్రామ పంచాయతీలను జనాభా ప్రాతిపదికన ప్రభుత్వ నిబంధనల మేరకు నాలుగు గ్రేడ్లుగా విభజించాం. జిల్లాలో 34 నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ప్రభుత్వం ఆమోదం తెలిపింతే రాబోయే ఎన్నికల్లో జిల్లా పంచాయతీల సంఖ్య 518కి చేరుతుంది.

జి. భాస్కర్‌, డీపీవో, కర్నూలు

ప్రతిపాదించిన నూతన పంచాయతీల

మండలం ప్రస్తుత ప్రతిపాదిత

పంచాయతీ గ్రామ పంచాయతీ

ఆదోని బసరకోడ అలసందగుత్తి

ఆదోని చిన్నహరివాణం చిన్న గోనేహాల్‌

ఆస్పరి తంగరడోణ తురవగల్లు

గోనేగండ్ల తిప్పనూరు బోదేపాడు, వీరంపల్లి

గోనేగండ్ల నెరుడుప్పల పిల్లిగుండ్ల

హలహర్వి గూళ్యం జె.హెసల్లి

హలహర్వి చింతకుంట సిరుగాపురం

కల్లూరు పెద్దటేకూరు దొడ్డిపాడు

కౌతాళం పొదలకుంట మదిరె

కౌతాళం ఉరుకుంద ఓబులాపురం

కౌతాళం నదిచాగి మ్యాలిగనూరు

కృష్ణగిరి అముకతాడు కర్లకుంట (కర్లకుంట,

మాదాపురం)

కృష్ణగిరి ఎస్‌హెచ్‌ఓ ఎర్రగుడి మన్నెకుంట

కృష్ణగిరి సీహెచ్‌ ఎర్రగుడి సంగాల

కృష్ణగిరి లక్కసాగరం పందిర్లపల్లి

మద్దికెర బసినేపల్లి మదనంతాపురం

నందవరం గురుజాల రాయచోటి

నందవరం హాలహర్వి బాబుపురం, జగ్గాపురం

నందవరం పెద్దకొత్తిలికి గంగావరం (గంగావరం,

జొహాపురం)

పత్తికొండ నలకదొడ్డి అటికెలగుండు

పత్తికొండ పులికొండ కొత్తపల్లి

తుగ్గలి బొందిమడుగుల లింగనేనిదొడ్డి

తుగ్గలి పగిడిరాయి పి.కొత్తూరు

తుగ్గలి శభాష్‌ పురం గుడిసెగుప్పిరాళ్ల,

దిగువ చింతలకొండ

వెల్దుర్తి సుదెపల్లి గుంటుపల్లి

వెల్దుర్తి లక్ష్మినగరం ఎల్‌.కొట్టాల (ఎల్‌.కొట్టాల,

సుగాలి తాండ,

ఎల్‌,తాండ, దాసరదొడ్డి

ఎమ్మిగనూరు కడివెళ్ల ఎస్‌.నాగులాపురం

ఎమ్మిగనూరు కందనాతి మాచుమాన్‌దొడ్డి

ఎమ్మిగనూరు పార్లపల్లి గువ్వలదొడ్డి

ఎమ్మిగనూరు కోటేకల్లు చెన్నాపురం (చెన్నాపురం,

నక్కలమిట్ట, బోడబండ)

ఎమ్మిగనూరు కలుగొట్ల కె.నాగులాపురం

ఎమ్మిగనూరు కడిమెట్ల ఎర్రకోట

ఎమ్మిగనూరు కడిమెట్ల సిరాల్‌దొడ్డి

ఎమ్మిగనూరు కడిమెట్ల రాళ్లదొడ్డి

Updated Date - Mar 21 , 2026 | 11:43 PM