ప్రాధాన్యత క్రమంలో మౌలిక వసతులు
ABN , Publish Date - May 29 , 2026 | 12:23 AM
నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రాధాన్యత క్రమంలో మౌలిక వసతుల పను లను చేపడుతున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు.
అభివృద్ధి పనులకు మంత్రి టీజీ భరత శంకుస్థాపన
కర్నూలు కల్చరల్, మే 28 (ఆంధ్రజ్యోతి): నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రాధాన్యత క్రమంలో మౌలిక వసతుల పను లను చేపడుతున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు. గురువారం నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసుతో కలిసి వివిధ వార్డుల్లో రూ.1.17 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. నగరంలోని 22, 23, 23, 25 వార్డుల్లో రూ.35.40 లక్షలతో సీసీ రోడ్లు, హెచడీపూఈఈ పైప్‌లైన్లు, కమ్యూనిటీ టాయిలెట్ల మరుమ్మతు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం 42, 43, 45, 46 వార్డుల్లో రూ.65.25 లక్షలతో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, పార్కు అభివృద్ధి, పైపులైన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే 47, 48, 50, 52 వార్డుల్లో రూ.16.99 లక్షలతో కమ్యూనిటీ టాయిలెట్ల మరమ్మతులు, డ్రైన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మంత్రి టీజీ భరత మాట్లాడుతూ నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు.