శ్రీశైలానికి తగ్గిన వరద
ABN , Publish Date - Aug 09 , 2026 | 11:12 PM
కృష్ణానది పరివాహక ప్రాంతాల నుంచి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. శ్రీశైల జలాశయానికి వస్తున్న వరద నీటికి ఇంచుమించు సమానంగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రా ల్లో నీటిని వినియోగించడంతో రిజర్వాయర్ నీటిమట్టం నిలకడగా ఉంది.
నీటి మట్టం 878.60 అడుగులు
181.05 టీఎంసీల నీరు నిల్వ
శ్రీశైలం, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): కృష్ణానది పరివాహక ప్రాంతాల నుంచి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. శ్రీశైల జలాశయానికి వస్తున్న వరద నీటికి ఇంచుమించు సమానంగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రా ల్లో నీటిని వినియోగించడంతో రిజర్వాయర్ నీటిమట్టం నిలకడగా ఉంది. ఆదివారం జూరాల ప్రాజెక్టు విద్యుదుత్పత్తి ద్వారా 44,279 క్యూసెక్కుల నీరు విడుదల కాగా 1,01,384 క్యూసెక్కుల నీరు సాయంత్రానికి జలాశ యానికి చేరుకున్నట్లు డ్యాం అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885అడుగులు కాగా ప్రస్తుతం 878.60 అడుగులు, పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలుకాగా 181.05 టీఎంసీలకు నీటి నిల్వ నమోదైనట్లు తెలిపారు. ఎడమ గట్టు(తెలంగాణ) జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో 11.400 మిలి యన్ యూనిట్ల కుడిగట్టు కేంద్రంలో 14.883 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. 60,177 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న నాగార్జునపాగర్‌కు అవుట్‌ఫ్లోగా విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.