Share News

శ్రీశైలానికి 1,71,184 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

ABN , Publish Date - Aug 03 , 2026 | 11:18 PM

శ్రీశైలం జలాశయంలో నీటినిల్వ క్రమక్రమంగా పెరుగుతూ ఉంది. వారం రోజులుగా వరద ప్రవాహం మొదలై 820 అడుగుల నుంచి పెరుగుతూ వస్తున్న కృష్ణమ్మ పరవళ్లతో జలాశయం జలకళను సంతరించుకుంటోంది.

శ్రీశైలానికి 1,71,184 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
శ్రీశైలం జలాశయం

శ్రీశైలం, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయంలో నీటినిల్వ క్రమక్రమంగా పెరుగుతూ ఉంది. వారం రోజులుగా వరద ప్రవాహం మొదలై 820 అడుగుల నుంచి పెరుగుతూ వస్తున్న కృష్ణమ్మ పరవళ్లతో జలాశయం జలకళను సంతరించుకుంటోంది. సోమవారం జూరాల ప్రాజెక్టు క్రస్ట్‌గేట్ల ద్వారా 1,38,000 క్యూసెక్కులు, విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 33,184 క్యూసెక్కులు కలిపి మొత్తంగా 1,71,184 క్యూసెక్కుల నీరు విడుదలై ఇన్‌ఫ్లోగా సాయంత్రానికి 1,49,917 క్యూసెక్కుల వరద జలాశయానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 855.10 అడుగుల మేర వచ్చింది. పుర్తిస్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 92.04 టీఎంసీల నీటి నిల్వ ఉంది. అదే విధంగా కుడి, ఎడమ జల విద్యుత్‌ ఉత్పిత్తి కేంద్రాల్లో ఎలాంటి ఉత్పాదన జరగడం లేదని జెన్‌కో అధికారులు తెలిపారు.

Updated Date - Aug 03 , 2026 | 11:18 PM