వీబీఆర్‌కు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో
ABN , Publish Date - Aug 08 , 2026 | 11:27 PM
వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. బానకచెర్ల సముదాయం నుంచి లింక్ చానల్ మీదుగా ఎని మిది వేల క్యూసెక్కుల నీరు జలాశయంలోకి వచ్చి చేరుతోంది.
వెలుగోడు, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి) : వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. బానకచెర్ల సముదాయం నుంచి లింక్ చానల్ మీదుగా ఎని మిది వేల క్యూసెక్కుల నీరు జలాశయంలోకి వచ్చి చేరుతోంది. వీబీఆర్ పూర్తి సామ ర్థ్యం 16.95 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో 262.96మీటర్ల వద్ద 2.90 టీ ఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలుగుగంగ అధికారులు తెలిపారు. మూడురోజుల నుంచి వీబీఆర్‌కు వరద వచ్చి చేరుతుండటంతో సందర్శకుల తాకిడి అధికమైంది.