18న అంటు వ్యాధులపై సదస్సు
ABN , Publish Date - Jan 13 , 2026 | 01:02 AM
ఈ నెల 18వ అంటు వ్యాధులు, ఇన్‌ఫెక్షన్ డిసీజ్‌పై రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్లు సీఐడీఎస్ ఏపీ చాప్టర్ ఆర్గనైజింగ్ చైర్మన్, జనరల్ మెడిసిన్ హెచ్‌వోడీ డా.డి.శ్రీనివాసులు వెల్లడించారు.
కర్నూలు హాస్పిటల్, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 18వ అంటు వ్యాధులు, ఇన్‌ఫెక్షన్ డిసీజ్‌పై రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్లు సీఐడీఎస్ ఏపీ చాప్టర్ ఆర్గనైజింగ్ చైర్మన్, జనరల్ మెడిసిన్ హెచ్‌వోడీ డా.డి.శ్రీనివాసులు వెల్లడించారు. డిప్యూటీ సూపరింటెడెంట్ డా.లక్ష్మీబాబు, మెడిసిన్ ప్రొఫెసర్లు డా.విద్యాసాగర్, డా.ఇక్బాల్ హుశేన్, డా.అబ్దుల్ రెహిమాన్, డా.మహేశ్వరరెడ్డి, డా.సోమప్పతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. మెడికల్ కాలేజీ న్యూలెక్చరర్ గ్యాలరీలో క్లినికల్ ఇన్‌ఫెక్షన్ డిసీజ్ సొసైటీ ఏపీ చాప్టర్ ఆధ్వర్యంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సదస్సు ఉంటుందన్నారు. రాష్ట్రంలోని 300 మంది జనరల్ మెడిసిన్ వైద్యులు పాల్గొంటారన్నారు. హెల్త్ యూనివర్సిటీ వీసీ డా.పి.చంద్రశేఖర్, కేఎంసీ ప్రిన్సిపాల్ డా.కే.చిట్టినరసమ్మ, సూపరింటెండెంట్ డా.కే.వెంకటేశ్వర్లు, క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ డా.సీఎస్ కృష్ణప్రకాష్ కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.ఎం.సత్య నారాయణ రెడ్డి పాల్గొంటారన్నారు.