డిజిటలైజేషన్ వైపు భక్తుల ఆసక్తి
ABN , Publish Date - Apr 05 , 2026 | 12:00 AM
శ్రీశైల క్షేత్రంలో సేవలన్నీ డిజిటలైజేషన్ చేయాలని భక్తులు ఆసక్తి చూపుతున్నారు. కియో స్క్ కౌంటర్ల ఏర్పాటుతో భక్తుకు సేవలు సులభతరం కానున్నాయి. దేవస్థానం భక్తుల సౌకర్యార్థం ఇప్పటికే ఆన్‌లైన్ విధానాన్ని అందుబాటులో ఉంచింది
కియోస్క్‌తో సేవలు సులభతరం
నగదు రహిత లావాదేవీలకే ప్రాధాన్యం
మనమిత్ర యాప్‌పై అవగాహన కల్పించాలి
శ్రీశైలం, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల క్షేత్రంలో సేవలన్నీ డిజిటలైజేషన్ చేయాలని భక్తులు ఆసక్తి చూపుతున్నారు. కియో స్క్ కౌంటర్ల ఏర్పాటుతో భక్తుకు సేవలు సులభతరం కానున్నాయి. దేవస్థానం భక్తుల సౌకర్యార్థం ఇప్పటికే ఆన్‌లైన్ విధానాన్ని అందుబాటులో ఉంచింది. శీఘ్ర అతిశీఘ్ర స్పర్శ దర్శనం టిక్కెట్లు, ఆర్జితసేవా టిక్కెట్లు, కేశ ఖండన, లడ్డూ ప్రసాదాలు, కొంతవరకు వసతి గదులను ముం దుగా అధికారిక వెబ్‌సైట్ల ద్వారా బుకింగ్ చేసుకునే అవకాశం కల్పిం చింది. క్షేత్రానికి వచ్చిన తరువాత కూడా దర్శనం, ఆర్జిత సేవా టిక్కె ట్లు పొందేందుకు సామాన్య భక్తులకు కూడా అర్ధమయ్యేలా ప్రత్యే కంగా రూపొందించిన 8 కియోస్క్ కౌంటర్లను కరూర్ వైశ్య బ్యాంక్ వారి సహకారంతో డొనేషన్ కౌంటర్, మల్లికార్జున సదన్, గణేష్ సదన్, సీఆర్‌వో కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటిని పూర్తిస్థాయిలో అమలుచేసేందుకు పలు విధాలైన సాంకేతిక సమస్యలతో జాప్యం జరుగుతుందని ఆలయాధికారులు అంటున్నారు. వారాంతపు రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉండటంతో ఏటీఎంలు కూడా మొరాయించడం పరిపాటిగా మారిపోయింది. ఇప్పటికైనా దేవస్థానం అధికారులు టోల్‌గేట్‌లో ఫాస్ట్‌ట్యాగ్ విధానాన్ని, టిక్కెట్లు, లడ్డూ కౌంటర్లలో డిజిటలైజేషన్ విధానాన్ని వీలైనంత త్వరగా అమలు చేయాలని భక్తులు కోరుతున్నారు.
మనమిత్ర యాప్‌పై అవగాహన లేక..
ప్రభుత్వం రూపొందించిన మనమిత్ర యాప్‌పై భక్తులలో అవగాహన లేకపోవడంతో కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. లడ్డూ ప్రసా దాలు, కేశఖండనశాల, టిక్కెట్ కౌంటర్లలో నాలుగు మాసాలుగా ట్రయల్‌రన్‌గా క్యూఆర్ కోడ్‌లను వినియోగిస్తున్నప్పటికీ భక్తు లు పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం లేదు. భక్తుల సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి మనమిత్ర యాప్‌పై మరింత విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.