Share News

జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి

ABN , Publish Date - Jan 20 , 2026 | 11:25 PM

జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోందని కలెక్టర్‌ రాజకుమారి అన్నారు. దేశంలోనే అతిపెద్ద 600,1200 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన సింగిల్‌ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్‌ (బీఈఎ్‌సఎస్‌) ఏర్పాటు చేస్తారన్నారు.

జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి
సమావేశానికి హాజరైన కలెక్టర్‌, ఎస్‌ఈసీఐ డైరెక్టర్‌ తదితరులు

సింగిల్‌ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్‌ ఏర్పాటు

కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల నూనెపల్లి, జనవరి 20 (ఆంధ్రజ్యోతి) : జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోందని కలెక్టర్‌ రాజకుమారి అన్నారు. దేశంలోనే అతిపెద్ద 600,1200 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన సింగిల్‌ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్‌ (బీఈఎ్‌సఎస్‌) ఏర్పాటు చేస్తారన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఎ్‌సఈసీఐ) ఆధ్వర్యంలో కలెక్టర్‌ అధ్యక్షతన ప్రాజెక్టుపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కొలిమిగుండ్ల మండలం నందిపాడులో 38.4 ఎకరాల విస్తీర్ణంలో ఎస్‌ఈసీఐ ద్వారా 600, 1200 మెగావాట్ల సామర్థ్యంతో బ్యాటరీ స్టోరేజ్‌ ప్రాజెక్టు స్థాపనకు భారత ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసినందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. డిసెంబరు నాటికి ప్రాజెక్టును ప్రారంభించాలనే లక్ష్యంతో ఎస్‌ఈసీఐ ముందుకు రావడం అభినందనీయమన్నారు. ప్రాజెక్టు వేగవంతంగా పూర్తి చేయడానికి జిల్లా యంత్రాంగం నుంచి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు. ఎస్‌ఈసీఐ డైరెక్టర్‌ శివకుమార్‌ మాట్లాడుతూ చాలా తక్కువ సమయంలో భూకేటాయింపు పూర్తిచేసి ప్రాజెక్టుకు అనుకూల వాతావరణం కల్పించిన కలెక్టర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. వేసవి కాలంలో లేదా అత్యవసర పరిస్థితుల్లో దేశంలోని ప్రధాన నగరాలకు విద్యుత్‌ కోతలు లేకుండా తక్షణమే 1200 మెగావాట్ల విద్యుత్‌ సరఫరా చేయడవే లక్ష్యమన్నారు. సమావేశంలో జేసీ కార్తీక్‌, డీఆర్వో రామునాయక్‌, నంద్యాల ఆర్డీవో విశ్వనాథ్‌, డోన్‌, బనగానపల్లి ఇన్‌చార్జి ఆర్డీవో నరసింహులు, పరిశ్రమల శాఖ జీఎం మహబూబ్‌బాషా, నేడ్కాప్‌ అధికారి వీరేంద్ర, డిప్యూ టీ మేనేజర్లు మిశ్రా, రోహిత్‌ చౌహాన్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 20 , 2026 | 11:25 PM