కరువు సీమలో పారిశ్రామిక ప్రగతి
ABN , Publish Date - May 14 , 2026 | 12:33 AM
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక మార్పులతో కరువు సీమలో పారిశ్రామిక ప్రగతి సాధిస్తుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు
రూ.50వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యం
పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్
గ్రీన్ ఫ్రూట్స్ పరిశ్రమకు శంకుస్థాపన
ఓర్వకల్లు, మే 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక మార్పులతో కరువు సీమలో పారిశ్రామిక ప్రగతి సాధిస్తుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. బుధవారం మండలంలోని గుట్టపాడు సమీపాన ఎంఎ్‌సఎంఈ పార్కులో ఏ ర్పాటుకానున్న శ్రీమాత్రే గ్రీన్ ఫ్రూట్స్ ప్రాసిసింగ్ యూనిట్‌కు ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డితో మంత్రి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు చొరవతో రాష్ట్రానికి భారీ స్థాయిలో పరిశ్రమలు వచ్చాయన్నారు. ఓర్వకల్లును పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. రానున్నరోజుల్లో రూ.50వేల కోట్ల పెట్టుబడులను ఓర్వకల్లుకు తీసుకురావడమే లక్ష్యమన్నారు. శ్రీమాత్రే గ్రీన్ ఫ్రూట్స్ ప్రైవేటు లిమిటెడ్ డైరెక్టర్ వేదవ్యాసరెడ్డి మాట్లాడుతూ 5.96ఎకరాల్లో రూ.10కోట్ల పెట్టుబడులతో ఆధునిక గ్రీన్ ఫ్రూట్స్ ప్రాసిసింగ్ యూనిట్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. ఈ పరిశ్రమతో ప్రత్యక్షంగా 30మందికి, పరోక్షంగా 2వేల మంది రైతులకు రాబోయే రోజుల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ సుబ్బారెడ్డి, విద్యా వెల్ఫేర్ అండ్ డెవల్‌పంట్ కార్పొరేషన్ చైర్మన్ నాగమణి, ఈవోఆర్‌డీ శాంతయ్య, జిల్లా ఉపాఽధ్యక్షుడు గోవిందరెడ్డి, మండల కన్వీనర్ నాగిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్లు సీఎన్ సుధాకర్ రెడ్డి, నాగేశ్వరరెడ్డి, సీ.సుధాకరయ్య, ఏపీఐఐసీ సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు.