వీరుల త్యాగ ఫలితమే స్వాతంత్య్రం
ABN , Publish Date - Aug 14 , 2026 | 11:51 PM
స్వాతంత్య్ర సమర వీరుల త్యాగ ఫలితమే నేటి మన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు.
ర్యాలీలో మంత్రి టీజీ భరత్
కర్నూలు అర్బన్, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర సమర వీరుల త్యాగ ఫలితమే నేటి మన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. శుక్రవారం నగరంలోని రాజ్ విహార్ నుంచి ఏ. క్యాంప్‌లోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సర్కిల్ వరకు నిర్వహించిన తిరంగా ర్యాలీని మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. ర్యాలీ అనంతరం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర ్యం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలని పిలుపు నిచ్చారు.