పెరిగిన పత్తి ధరలు
ABN , Publish Date - May 07 , 2026 | 11:05 PM
ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తిధరలు రోజురోజుకి పెరుగుతున్నాయి.
క్వింటా గరిష్ఠంగా రూ.10,199
ఆదోని అగ్రికల్చర్, మే 7 (ఆంధ్రజ్యోతి): ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తిధరలు రోజురోజుకి పెరుగుతున్నాయి. సోమవారం పత్తి ధర గరిష్ఠంగా రూ. 9,615 ఉన్న ధర పెరుగుతూ గురువారం నాటికి ధర క్వింటాలు రూ.10,199 చేరింది. సీజన్ ముగియడం, రైతుల దగ్గర పత్తి లేకపోవడంతో వ్యాపారుల మధ్య పోటీ పెరిగి ధరలు పెరగడానికి కారణమైంది. పత్తి జిన్నింగ్ పరిశ్రమల్లో ఉత్పత్తికి సరిపడా పత్తి మార్కెట్‌కు రాకపోవడంతో వ్యాపారులు అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. వేసవి వ్యవసాయ పనులు ప్రారంభానికి ముందు పత్తి ధరలు పెరుగుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 438 క్వింటాళ్ల పత్తి విక్రయానికి రాగా గరిష్ఠ ధర రూ.10,199 మధ్యస్థ రూ.9,789 కనిష్ఠ ధర రూ.5,589 పలికింది.