పెరిగిన పత్తి ధరలు
ABN , Publish Date - Mar 25 , 2026 | 11:15 PM
ఆదోని వ్యవసాయ మార్కెట్ యా ర్డులో పత్తిధరలు పెరిగాయి.
క్వింటం రూ.8,719
ఆదోని అగ్రికల్చర్, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): ఆదోని వ్యవసాయ మార్కెట్ యా ర్డులో పత్తిధరలు పెరిగాయి. గతవారంతో పోల్చితే క్వింటానికి రూ.400 పైగా పెరిగింది. పత్తి ధరలు మళ్లీ పెరుగుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులుగా పత్తి ధరలు స్థిరంగా ఉన్నాయి. మళ్లీ పత్తి ధరలు పెరుగుతుండడంతో రైతులు నిలువ ఉంచిన విక్రయించుకోవడానికి ఆసక్తి చెబుతున్నారు. 1159 క్వింటాళ్ల పత్తి విక్రయానికి రాగా కనిష్ఠ ధర రూ.4,169, మధ్యస్థం రూ.8,289, గరిష్ఠ ధర రూ.8,719 పలికింది.