పెరిగిన పత్తి ధరలు
ABN , Publish Date - Jan 08 , 2026 | 11:26 PM
ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి ధరలు రోజురోజుకి పెరుగుతున్నాయి. గురువారం పత్తి ధర క్వింటా గరిష్టంగా రూ.8,149కు చేరుకుంది.
క్వింటా గరిష్ఠంగా రూ.8,149
ఆదోని అగ్రికల్చర్, జనవరి 8(ఆంధ్రజ్యోతి): ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి ధరలు రోజురోజుకి పెరుగుతున్నాయి. గురువారం పత్తి ధర క్వింటా గరిష్టంగా రూ.8,149కు చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం సీసీఐ ద్వారా కల్పిస్తున్న కనీస మద్దతు ధర కంటే మార్కెట్‌లో అధిక ధర పలుకుతోంది. ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తి గింజల ధరలు పెరగడంతో స్థానిక మార్కెట్ యార్డ్‌లో పత్తి ధర పుంజుకుందని కాటన్ మర్చంట్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. వీటికి తోడు వ్యాపారుల మధ్య పోటీ కూడా ధరల పెరుగుదలకు కారణమైంది. గురువారం మార్కెట్‌కు 2,097 క్వింటాళ్ల పత్తి విక్రయానికి రాగా వాటి కనిష్ఠ ధర రూ.4,279, సగటున రూ.7,469, గరిష్ఠ ధర రూ.8,149గా పలికింది.