శ్రామికుల సంఖ్యను పెంచండి
ABN , Publish Date - Oct 15 , 2026 | 12:12 AM
వీబీ జీరామ్జీ పథకం కింద ఉపాధి కల్పించి శ్రామికుల సంఖ్యను పెంచాలని కలెక్టర్ ఏ.సిరి డ్వామా పీడీని ఆదేశించారు.
కలెక్టర్ ఏ. సిరి
గూడూరు అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): వీబీ జీరామ్జీ పథకం కింద ఉపాధి కల్పించి శ్రామికుల సంఖ్యను పెంచాలని కలెక్టర్ ఏ.సిరి డ్వామా పీడీని ఆదేశించారు. బుధవారం మండలంలోని కె నాగలాపురంలో జలధార - జలహారతి 2.0 కింద చేపడుతున్న నీటి సంరక్షణ పనులను ఆమె పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ వీబీ జీరామ్జీ పథకం కింద చేపట్టిన పనులను నిర్దేశిత సమయంలో పూర్తి చేయడంతో పాటు, శ్రామికులకు విస్తృతంగా ఉపాధి కల్పించా లన్నారు. గత వారం 80 నుంచి 90 మంది కూలీలు హాజరు కాగా ప్రస్తుతం 110మంది లక్ష్యానికి 60మంది మాత్రమే పనులకు వస్తు న్నారని శ్రామికులకు ఉపాధి హామీ పనుల ప్రాధాన్యతను వివరించి పనులకు హాజరయ్యేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. కూ లీలతో కలెక్టర్ మాట్లాడుతూ వారానికి ఎన్ని రోజులు పని లభిస్తోంది, వేతనాలు సక్రమంగా అందుతున్నాయా అని అడిగి తెలుసుకు న్నా రు. డ్వామా పీడీ నరసింహారెడ్డి, డ్వామా ఏపీడీ పద్మ పాల్గొన్నారు.