విద్యార్థుల అడ్మిషన్లు పెంచండి
ABN , Publish Date - Jun 28 , 2026 | 12:12 AM
విద్యార్థుల అడ్మిషన్లను పెంచక పోతే బాలుర ప్రాథమిక ఉన్నత పాఠశాలను బాలికల పాఠశాలగా మారు స్తామని రాష్ట్ర విద్యాశాఖ మౌలిక సదుపాయాల జాయింట్ డైరెక్టర్ (జేడీ) మువ్వా రామలింగం హెచ్చరించారు.
విద్యాశాఖ మౌలిక సదుపాయాల జేడీ మువ్వా రామలింగం
కోడుమూరు, జూన్ 27(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల అడ్మిషన్లను పెంచక పోతే బాలుర ప్రాథమిక ఉన్నత పాఠశాలను బాలికల పాఠశాలగా మారు స్తామని రాష్ట్ర విద్యాశాఖ మౌలిక సదుపాయాల జాయింట్ డైరెక్టర్ (జేడీ) మువ్వా రామలింగం హెచ్చరించారు. పట్టణంలోని జడ్పీ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలను ఆయన శనివారం తనిఖీ చేశారు. ఈయన వెంట డీఈవో సుధాకర్ ఉన్నారు. విద్యార్థులకు అందుతున్న తాగునీటితోపాటు పాఠశాల లో పరిశుభ్రత, మరుగుదొడ్ల, శానిటేషన్ నిర్వహణ గురించి అడిగి తెలు సుకున్నారు. నాబార్డు, నాడు-నేడు కింద పాఠశాలల్లో నిర్మించిన పనులను ఆయన పరిశీలించారు. బాలికల పాఠశాలలో నిరుపయోగంగా ఉన్న తాగు నీటి ఆర్వో ప్లాంట్ గురించి వివరణ ఇవ్వాలని ఆదేశించారు. నాబార్డు నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదులు, భవనం ముందు నిర్మించిన మెట్లు, ఫ్లోరింగ్ కుంగిపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నాసి రకం పనుల గురించి రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తానని, నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టిస్తానని చెప్పారు. బాలుర పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలలో అన్ని మౌలిక సదుపా యాలు, పూర్వ విద్యార్థులు రిటైర్డ్ కలెక్టర్ ఇంతియాజ్ సహకారంతో రూ.3 కోట్ల సీఎస్‌ఆర్ నిధులతో అదనపు గదులు నిర్మించినప్పటికీ ఆశించిన స్థాయిలో అడ్మిషన్లు లేవన్నారు. జూలై 15 వరకు గడువు ఇస్తున్నామని ఈలోపు ఉపాధ్యాయులంతా సమన్వయంతో పని చేసి అడ్మిషన్లు పెంచాల న్నారు. లేకపోతే బాలుర పాఠశాలను బాలికల పాఠశాలగా మార్చే ప్రక్రియ ప్రారంభిస్తామనిబాలుర ప్రధానోపాధ్యాయులు రామచంద్రుడును హెచ్చ రించారు. ఎంఈవో రామచంద్రుడు, బాలిక ప్రధానోపాధ్యాయురాలు శైల జకుమారి, ఉపాధ్యాయులు తిమ్మారెడ్డి, కిషోర్, గాజుల కృష్ణమోహన్, కుమార్ పాల్గొన్నారు.