అసంబద్ధతలను తొలగించాలి
ABN , Publish Date - Feb 28 , 2026 | 12:38 AM
పదో తరగతి పబ్లిక్ పరీక్షల విధుల్లో అసంబద్ధతలను తొలగించాలని పీఆర్‌టీయూ జిల్లా అధ్య క్షుడు ఎనవీ కృష్ణారెడ్డి, ఆర్‌యూపీపీ జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర శుక్రవారం పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ గోవిందు నాయక్‌కు కలిసి వినతి పత్రం అందజేశారు.
కర్నూలు ఎడ్యుకేషన, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): పదో తరగతి పబ్లిక్ పరీక్షల విధుల్లో అసంబద్ధతలను తొలగించాలని పీఆర్‌టీయూ జిల్లా అధ్య క్షుడు ఎనవీ కృష్ణారెడ్డి, ఆర్‌యూపీపీ జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర శుక్రవారం పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ గోవిందు నాయక్‌కు కలిసి వినతి పత్రం అందజేశారు. పదో తరగతి పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ ఆఫీసర్లు విధుల్లో ఏవిధ మైన అనుభవం లేని జూనియర్ స్కూల్ అసిస్టెంట్లను కేటాయించడం వలన పరీక్షలు సజావుగా నిర్వహించడంలో ఇబ్బందులు ఎదురవుతా యన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని సీనియర్ ఉపాధ్యాయు లకు చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంట్ ఆఫీసర్లను కేటా యించా లని కోరారు. అదేవిధంగా రంజాన పండుగను పురస్కరించుకుని ము స్లిం ఉపాధ్యాయులకు ఈ పరీక్షల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. పీఆర్‌టీయూ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంటు రవిప్రకాష్, స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంటు రమణయ్య, రాష్ట్ర కౌన్సిలర్స్ వీరారెడ్డి, లక్ష్మీనారాయణ, ఆదినారాయణరెడ్డి, ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.