జీవన ప్రమాణాల మెరుగు
ABN , Publish Date - Jul 02 , 2026 | 11:19 PM
‘వీబీజీ-రామ్‌జీ’ ద్వారా జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. గురువారం స్థానిక మార్కెట్ యార్డులో వీబీజీ-రామ్‌జీ కార్యక్రమాన్ని కలెక్టరు రాజకుమారితో కలిసి ప్రారంభించారు.
ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
పాణ్యంలో ‘వీజీబీ-రామ్‌జీ’ ప్రారంభం
పాణ్యం, జూలై 2 (ఆంధ్రజ్యోతి) : ‘వీబీజీ-రామ్‌జీ’ ద్వారా జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. గురువారం స్థానిక మార్కెట్ యార్డులో వీబీజీ-రామ్‌జీ కార్యక్రమాన్ని కలెక్టరు రాజకుమారితో కలిసి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఈ పథకం ద్వారా చేపడుతున్న పనులు జిల్లా అభివృద్ధికి దోహదపడుతున్నాయన్నారు. గ్రామాల అభివృద్ధికి గ్రామ సభలో ప్రజలు కోరిన పనులు ఎంపీడీవో కార్యాలయం ద్వారా 14 రోజుల్లో ఆమోదం చేస్తారన్నారు. కలెక్టరు రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో 2.50లక్షల మంది ఉపాధి కార్మికులు ఉన్నారన్నారు. ‘వీబీజీ-రామ్‌జీ’ ద్వారా 125 రోజుల పనిదినాలు కల్పిస్తారన్నారు. ఇందులో కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం వాటాతో కూలీలకు సమయానికి వేతనాలు చెల్లిస్తుందన్నారు. రైతుల అభ్యర్థనల మేరకు పొలాల్లో పంట రస్తాలు ఏర్పాటు చేస్తారన్నారు. అనంతరం యార్డు ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ శ్రీధర్‌రెడ్డి, గ్రౌండ్ వాటర్ డీడీ రఘురాం, డ్వామా పీడీ సూర్యనారాయణ, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, టీడీపీ మండల కన్వీనర్ జయరామిరెడ్డి, వీబీజీ రాంజీ సిబ్బంది, కూలీలు పాల్గొన్నారు.