పని తీరు మెరుగుపరుచుకోండి
ABN , Publish Date - May 26 , 2026 | 11:23 PM
నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం అధికారులు తమ పనితీరు మరింత మెరుగు పరుచుకోవాలని కమిషనర్ చల్లా ఓబులేసు సూచించారు.
నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు
కర్నూలు న్యూసిటీ, మే 26(ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం అధికారులు తమ పనితీరు మరింత మెరుగు పరుచుకోవాలని కమిషనర్ చల్లా ఓబులేసు సూచించారు. మంగళవారం నగరపాలక కార్యాలయంలో ఇంజనీరింగ్ విభాగ అధికారులతో కమిషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ అధికారులు ప్రతిరోజూ ఉదయం కనీసం రెండు గంటల పాటు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పనుల పురోగతిని పరిశీలించాలని ఆదేశించారు. ప్రతి అధికారికి వైర్‌లెస్ సెట్లు తప్పనిసరిగ్గా ఉండాలని, ఏసీసీఎంఎంఎస్ యాప్‌ను సమర్దవంతంగా వినియోగించాలని సూచించారు. పనులు పూర్తిస్థాయిలో ముగియక ముందు బిల్లులు చేయరాదని, ఫినిషింగ్ పనుల్లో నిర్లక్ష్యం సహించబోమన్నారు. మొక్కలు నాటడమే కాకుండ ట్రీ గార్డులు ఏర్పాటుచేసి వాటిని సంరక్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ ఆర్‌జీవి.కృష్ణ, ఎస్‌ఈ జే.రమణ మూర్తి, ఎంఈలు మనోహర్‌రెడ్డి, గిరిరాజు, హర్టికల్చర్ ఏడి ప్రతాప్‌రెడ్డి, డీఈఈలు, ఏఈఈలు పాల్గొన్నారు.