Share News

బాలికల విద్యాభివృద్ధికి పెద్దపీట

ABN , Publish Date - Oct 04 , 2026 | 12:18 AM

బాలికల విద్యాభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం పెద్దపీట వేసిందని మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆర్టీ రాష్ట్ర కార్యదిర్శి చల్లా విజయభాస్కర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ఉగ్రసేనారెడ్డి, ఎస్టీసెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటరమణనాయక్‌తో కలసి కస్తూర్బా ప్రాంగణంలో రూ.1.67 కోట్లతో నిర్మించిన జూనియర్‌ కళాశాల అదనపు గదులు, వసతి గృహాన్ని ప్రారంభించారు.

 బాలికల విద్యాభివృద్ధికి పెద్దపీట
అవుకు: కస్తూర్బా కళాశాల భవనాన్ని ప్రారంభిస్తున్న మంత్రి

మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి

అవుకు కస్తూర్బాలో కళాశాల భవనం, కొలిమిగుండ్లలో తరగతి గదులు ప్రారంభం

అవుకు, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): బాలికల విద్యాభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం పెద్దపీట వేసిందని మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆర్టీ రాష్ట్ర కార్యదిర్శి చల్లా విజయభాస్కర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ఉగ్రసేనారెడ్డి, ఎస్టీసెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటరమణనాయక్‌తో కలసి కస్తూర్బా ప్రాంగణంలో రూ.1.67 కోట్లతో నిర్మించిన జూనియర్‌ కళాశాల అదనపు గదులు, వసతి గృహాన్ని ప్రారంభించారు. విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు మంత్రి లోకేష్‌ ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నారన్నారు. విద్యనే సమాజాభివృద్దికి బలమైన పునాది అని, నాణ్యమైన విద్య, మౌళిక వసతులను కల్పించి ప్రోత్సహిస్తున్నామన్నారు. ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయం రంగాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. తహసీల్దార్‌ ఫకీర్‌అహ్మద్‌, ఎంపీడీవో రామకృష్ణవేణి, ఎంఈవోలు శ్రీధర్‌రావు, వెంకటేశ్వరరెడ్డి, ఆర్‌డబ్యూఎస్‌ ఏఈ సాయికుమార్‌రాజు, ట్రాన్స్‌కో ఏఈ పక్కీరయ్య, వీబీజీరామ్‌జీ ఏపీవో ప్రకా్‌షరావు, ఈవో విజయకుమారి, పాఠశాల ఇన్‌చార్జి ఎస్‌వో భారతి, మొట్ల రామిరెడ్డి, ఎస్‌ రామకృష్ణారెడ్డి, మారం పుల్లారెడ్డి, దంతెలరమణ, అరుణ్‌కుమార్‌నాయక్‌, సన, కిట్టు, మధుమోహన్‌రెడ్డి, జగదీశ్వరరెడ్డి, బోర్వెల్‌ శివారెడ్డి, బాలనాగిరెడ్డి, శివరామిరెడ్డి, బైరెడ్డి భాస్కర్‌రెడ్డి, రఘనాథరెడ్డి పాల్గొన్నారు.

విద్యాభివృద్ధికి మంత్రి లోకేశ్‌ కృషి

కొలిమిగుండ్ల: పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తూ, విద్యాభివృద్ధికి బలోపేతానికి రాష్ట్ర మంత్రి లోకేశ్‌ కృషి చేస్తున్నారని ఆర్‌అండ్‌బీ మంత్రి బీసీ పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో రూ.1.67కోట్లతో నిర్మించిన అదనపు గదులను ప్రారంభించారు. మహిళల విద్యతోనే సమాజం మరింత బలోపేతం అవుతుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పనిసరిగా పాఠశాలలకు పంపించాలని సూచించారు. మూలే రామేశ్వర్‌ రెడ్డి, వీఆర్‌ లక్ష్మీరెడ్డి, నంద్యాల రామేశ్వర్‌ రెడ్డి, నరసింహుడు, వెంకటేశ్వరరావు, సురేష్‌, క్రిష్ణారెడ్డి, నంద్యాల నారాయణ రెడ్డి, గూలి నాగేశ్వర్‌ రెడ్డి, పాల్గొన్నారు.

Updated Date - Oct 04 , 2026 | 12:18 AM