ఎన్నికల నిబంధనలు అమలు చెయ్యాలి
ABN , Publish Date - Oct 16 , 2026 | 12:00 AM
ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా అమలు చెయ్యాలని సబ్ కలెక్టర్ మనీషా ఆదేశించారు
నంద్యాల సబ్ కలెక్టర్ మనీషా
ఆళ్లగడ్డ, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా అమలు చెయ్యాలని సబ్ కలెక్టర్ మనీషా ఆదేశించారు. గురువారం తహసీల్దార్ కార్యాలయంలో మండల అధికారులతో సమీ నిర్వహించారు. సమస్యాత్మక ప్రాంతాలు, పోలింగ్ కంద్రాల వివరాలను సేకరించి రెవెన్యూ, పోలీసు, మున్సిపల్ అధికారులకు సూచనలు చేశారు. సమన్వయంగా పనిచేసి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. తహసీల్దార్ జ్యోతి రత్నకుమారి, సీఐలు రాము, రమణ, మన్సిపల్ మేనేజర్ ఆనంద్ పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను సబ్ కలెక్టర్ పరిశీలించారు.