Share News

వేజ్‌ రివిజన్‌ అమలు చేయాలి

ABN , Publish Date - Jul 17 , 2026 | 12:19 AM

భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు తక్షణమే వేజ్‌ రివిజన్‌ అమలు చేయాలని ఆల్‌ ఇండియా బీఎ్‌సఎన్‌ఎల్‌ పెన్షనర్ల ఉద్యోగుల సంఘం సర్కిల్‌ అధ్యక్షుడు యాకోబు డిమాండ్‌ చేశారు.

వేజ్‌ రివిజన్‌ అమలు చేయాలి
జీఎం కార్యాలయం వద్ద ఉద్యోగుల నిరసన

కర్నూలు న్యూసిటీ, జూలై 16(ఆంధ్రజ్యోతి): భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు తక్షణమే వేజ్‌ రివిజన్‌ అమలు చేయాలని ఆల్‌ ఇండియా బీఎ్‌సఎన్‌ఎల్‌ పెన్షనర్ల ఉద్యోగుల సంఘం సర్కిల్‌ అధ్యక్షుడు యాకోబు డిమాండ్‌ చేశారు.

గురువారం సుంకేసుల రోడ్డులోని సంస్థ జనరల్‌ మేనేజర్‌ కార్యాలయం ఎదుట బీఎ్‌సఎన్‌ఎల్‌ కో ఆర్టినేషన్‌ కమిటి ఇచ్చిన పిలుపు మేరకు డిమాండ్స్‌ డే ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యాకోబు మాట్లాడుతూ పెన్షనర్లకు పెన్షన్‌ రివిజన్‌ అమలు చేయాలన్నారు. విత్‌ డ్రా చేయడంతో పాటు వ్యాలిడేషన్‌ చట్టాలను తీసుకురావాలన్నారు. క్యాజువల్‌ లేబర్‌కు 7వ సీపీసీ పే స్కేల్‌ అమలు చేయాలన్నారు. కాంట్రాక్టు కార్మికులను నిలిపివేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు మహేశ్వరరావు, సహాయ కార్యదర్శి డి. వెంకట్రామిరెడ్డి, జిల్లా కార్యదర్శి ఎల్‌. విజయభాస్కర్‌, ఉపాధ్యక్షుడు మద్దిలేటి, కోశాధికారి ఖాజామోద్దీన్‌, షబ్బీర్‌, డి. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

బీఎ్‌సఎన్‌ఎల్‌ ఉద్యోగుల సంఘం, ఏఐబీడీపీఏ అండ్‌ సీపీడబ్ల్యూఎఫ్‌ అధ్వర్యంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో జనరల్‌ మేనేజర్‌ కార్యాలయం ఎదుట డిమాండ్ల సాధన కోసం నిరసన తెలిపారు. వేజ్‌ రివిజన్‌ అమలు చేయాలని, పెన్షన్‌ రివిజన్‌ చేయాలని, 3వ పీఆర్‌సీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బీఎ్‌సఎన్‌ఎల్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు నౌషద్‌, ప్రధాన కార్యదర్శి ఎన్‌. రామరాజు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - Jul 17 , 2026 | 12:19 AM