హైకోర్టు శాశ్వత బెంచ్‌ను ఏర్పాటు చేయాలి
ABN , Publish Date - Sep 11 , 2026 | 12:18 AM
కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు వెంటనే చర్యలు చేపట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలని ఐలు (ఏఐఎల్‌యూ) రాష్ట్ర అధ్యక్షుడు కెంగార కుమార్ డిమాండ్ చేశారు
ఐలు డిమాండ్
కర్నూలు లీగల్, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు వెంటనే చర్యలు చేపట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలని ఐలు (ఏఐఎల్‌యూ) రాష్ట్ర అధ్యక్షుడు కెంగార కుమార్ డిమాండ్ చేశారు. స్థానిక బాలశివ కళాశాలలో ఐలు జనరల్ బాడీ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ శాశ్వత హైకోర్టు బెంచ్ విషయంలో ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యాన్ని ఉపేక్షించలేమని అన్నారు. దీనిపై రాయలసీమ జేఏసీ న్యాయవాదులందరినీ ఏకం చేసి పోరాడుతామని ఆయన హెచ్చరించారు. ఐలు రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటస్వామి మాట్లాడుతూ హైకోర్టు బెంచ్ కోసం జరిగే ప్రతి కార్యక్రమంలో తాము ప్రధాన పాత్ర వహిస్తామని అన్నారు. ప్రతి యువ న్యాయవాదికి రూ.10వేలు స్టైఫండ్‌ను ప్రభుత్వం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐలు జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్, గౌరవాధ్యక్షుడు ఎం. వెంకటేశ్వర్లు, న్యాయవాదులు మహ్మద్ రఫీ, చంద్రశేఖర్ ఆజాద్ తదితరులు పాల్గొన్నారు.