అమరజీవి త్యాగం.. యువతకు స్ఫూర్తి
ABN , Publish Date - Mar 16 , 2026 | 11:29 PM
పొట్టి శ్రీరాములు జీవితం, యువతకు స్ఫూర్తిదాయకమని కలెక్టర్ డా.ఏ. సిరి తెలిపారు.
కలెక్టర్ డా.ఏ. సిరి
కర్నూలు కలెక్టరేట్, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): పొట్టి శ్రీరాములు జీవితం, యువతకు స్ఫూర్తిదాయకమని కలెక్టర్ డా.ఏ. సిరి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కలెక్టర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలుగు మాట్లాడే ప్రజల కోసం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తూ అక్టోబరు 1952లో చెన్నైలో ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారన్నారు. 58 రోజుల సుదీర్ఘ పోరాటం తర్వాత డిసెంబరు 15, 1952న ఆయన అమరులయ్యారనీ అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, సెట్కూరు సీఈవో డా. వేణుగోపాల్, బీసీ వెల్ఫేర్ అధికారి ప్రసూన పాల్గొన్నారు.