Share News

టపాసుల అక్రమ నిల్వ నేరం : ఎస్పీ

ABN , Publish Date - Nov 06 , 2026 | 11:46 PM

అక్రమంగా టపాసులు నిల్వ ఉంచినా, విక్రయించినా నేరమని, చర్యలు తప్పవని ఎస్పీ సునీల్‌షొరాణ్‌ హెచ్చరించారు.

టపాసుల అక్రమ నిల్వ నేరం : ఎస్పీ

నంద్యాల నూనెపల్లి, నవ ంబరు 6 (ఆంధ్రజ్యోతి) : అక్రమంగా టపాసులు నిల్వ ఉంచినా, విక్రయించినా నేరమని, చర్యలు తప్పవని ఎస్పీ సునీల్‌షొరాణ్‌ హెచ్చరించారు. శుక్రవారం జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ నిర్వాహకులు ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. లైసెన్స్‌ కల్గిన దుకాణాలలో మాత్రమే బాణసంచా విక్రయించాలన్నారు. నీరు, ఇసుక తదితర అగ్నిమాపక సామగ్రిని దుకాణాల్లో సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రస్తుతం అనుమతులు లేని షాపులపై ఆకస్మిక దాడులు చేసినట్లు తెలిపారు.

Updated Date - Nov 06 , 2026 | 11:46 PM