Share News

హంద్రీ నుంచి అక్రమ ఇసుక తరలింపు

ABN , Publish Date - Jan 08 , 2026 | 11:24 PM

తిప్పనూరు, వేముగోడు, పుట్టపాశం గ్రామ శివార్లలలోని హంద్రీ నదిలో కొందరు అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో రాయలసీమ జోనల్‌ మైనింగ్‌ ఏడీ వెంకటేశ్వర్లు(ఏడీ విజిలెన్స్‌) జిల్లా రాయల్టీ ఇన్‌స్పెక్టర్‌ శివపార్వతి, రెవెన్యూ సిబ్బంది, గురువారం హంద్రీనదిలో తనిఖీ నిర్వహించారు.

హంద్రీ నుంచి అక్రమ ఇసుక తరలింపు
తిప్పనూరు హంద్రీలోకి వెళ్లకుండా తీసిన గొయ్యిని పరిశీలిస్తున్న రాయలసీమ మైనింగ్‌ అధికారులు

రాయలసీమ జోన్‌ మైనింగ్‌ అధికారుల విచారణ

అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కేసులు నమోదు చేయండి సీఐ, తహసీల్దార్‌ కు సూచన

గోనెగండ్ల, జనవరి 8(ఆంధ్రజ్యోతి): తిప్పనూరు, వేముగోడు, పుట్టపాశం గ్రామ శివార్లలలోని హంద్రీ నదిలో కొందరు అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో రాయలసీమ జోనల్‌ మైనింగ్‌ ఏడీ వెంకటేశ్వర్లు(ఏడీ విజిలెన్స్‌) జిల్లా రాయల్టీ ఇన్‌స్పెక్టర్‌ శివపార్వతి, రెవెన్యూ సిబ్బంది, గురువారం హంద్రీనదిలో తనిఖీ నిర్వహించారు. రోజుకు హంద్రీ నది నుంచి ఎన్ని ట్రాక్టర్ల ఇసుకను అక్రమంగా తరలిస్తున్నదీ విచా రణ చేపట్టారు. ఇక నుంచి ఉన్నతాధికారుల అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే వారి పై కఠిన చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు. గోనెగండ్ల తహసీల్దార్‌ రాజేశ్వరిని, సీఐ చంద్రబాబును కలసి అక్రమ ఇసుక తరలింపుపై చర్చించారు. అనంతరం మైనింగ్‌ అధికారులు మాట్లాడుతూ గోనెగండ్ల మండలం లోని తిప్పనూరు, వేముగోడు, పుట్టపాశం గ్రామాల హంద్రీ నదిలో ప్రభుత్వ అనుమతి ఉన్న ఇసుక రీచ్‌ లేదు కాబట్టి అక్కడ ఇసుకను తరలిస్తే కఠినచర్యలు తీసుకుంటామన్నారు.

మైనింగ్‌ అధికారుల విచారణతో అక్రమ ఇసుక వ్యాపారులకు దడ: మైనింగ్‌ అధికారులతు విచారణ చేపట్టడంతో అక్రమ ఇసుక వ్యాపారుల గుండెల్లో దడ మొదలైంది. ఎవరిపై కేసులు నమోదు చేసిందీ తెలుసుకొనే ఆరా తీసినట్లు తెలిసింది. గురువారం హంద్రీ నదివైపు ఒక్క ట్రాక్టర్‌ కూడా వెళ్లలేదు. హంద్రీ నదిలోకి ట్రాక్టర్‌లు వెళ్లకుండా దారికి అడ్డంగా గొయ్యి తీయ్యడంతో ట్రాక్టర్లు ఆగిపోయాయి.

Updated Date - Jan 08 , 2026 | 11:24 PM