వివాహేతర సంబంధమే కారణం
ABN , Publish Date - Mar 19 , 2026 | 12:21 AM
దుర్గా భోగేశ్వర ఆలయం వాచ్‌మెన్ శ్రీనివాసులు(35) హత్య కేసులో పోలీసులు దర్యాప్తు వివరాలు వెల్లడించారు. శ్రీనివాసులు భార్య వరలక్ష్మి మరో వ్యక్తితో కలిసి భర్తను గొంతు నలిమి హత్య చేసి యాసిడ్ పోసి మృతదేహన్ని కాల్చివేసినట్లు తేలింది.
వీడిన శ్రీనివాసులు హత్య కేసు మిస్టరీ
వెల్లడించిన సీఐ కిరణ్‌కుమార్‌రెడ్డి
గడివేముల, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): దుర్గా భోగేశ్వర ఆలయం వాచ్‌మెన్ శ్రీనివాసులు(35) హత్య కేసులో పోలీసులు దర్యాప్తు వివరాలు వెల్లడించారు. శ్రీనివాసులు భార్య వరలక్ష్మి మరో వ్యక్తితో కలిసి భర్తను గొంతు నలిమి హత్య చేసి యాసిడ్ పోసి మృతదేహన్ని కాల్చివేసినట్లు తేలింది. పాణ్యం సీఐ కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం తెలిపిన వివరాల మేరకు.. గడిగరేవుల గ్రామానికి చెందిన శ్రీనివాసులుకు, నందికొట్కూరు మండలం దామగట్ల గ్రామానికి చెందిన వరలక్ష్మికి 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. శ్రీనివాసులు ఈ నెల 10వ తేదిన అనుమానాస్పద పరిస్థితుల్లో అదృశ్యమయ్యాడు. అతను ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు. అయినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఈనెల 12వ తేదిన తల్లి లక్ష్మీదేవి గడివేముల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదుచేసి దర్యాప్తు చేస్తున్న క్రమంలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. వరలక్ష్మి తనకు మామ వరుసయ్యే గడిగరేవుల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాసులు ఈ నెల 10వ తేదీ భార్యను మందలించాడు. దీంతో శ్రీనివాసులును చంపాలనే ఉద్దేశంతో వరలక్ష్మి అతనిపై దాడిచేసి గాయపరచిందన్నారు. శ్రీనివాసులు తీవ్రంగా గాయపడ్డాక వరలక్ష్మి తన మామ వెంకటేశ్వర్లును పిలిపించి, ఇద్దరూ కలిసి శ్రీనివాసులు గొంతు నులిమి హత్యచేశారు. ఆనవాళ్లను బయటపడకుండా ఉండేందుకు మృతదేహాన్ని 5లీటర్ల యాసిడ్ పోసి కాల్చేశారు. ఆ తర్వాత మృతదేహంపై మన్ను పోసి కప్పిపెట్టారు. దర్యాప్తులో పోలీసులకు వరలక్ష్మిపై అనుమానం వచ్చి విచారించారు. దీంతో భర్తను హత్య చేసినట్లు తహసీల్దార్ వెంకటరమణ సమక్షంలో వరలక్ష్మి అంగీకరించింది. ఆమె చెప్పిన స్థలంలో వెతకగా.. మృతదేహం అస్థికలు లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. వరలక్ష్మిని, ఆవుల వెంకటేశ్వర్లును రిమాండ్‌కు తరలించినట్లు పాణ్యం సీఐ కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎస్‌ఐ నాగార్జున్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రియుడితో కలిసి భర్త హత్య
ముగ్గురి అరెస్టు
నంద్యాల క్రైం, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): వివాహేతర సంబంధం ఓ వ్యక్తి హత్యకు దారి తీసింది. ప్రమాదవశాత్తూ మృతి చెందినట్లుగా చేసిన ప్రయత్నం వెనుక ఉన్న వాస్తవాలను పోలీసుల దర్యాప్తులో బైటపెట్టారు. నంద్యాల పట్టణం నూనెపల్లెలోని మంచినీళ్ల బావి వీధికి చెందిన అరీఫ్(38) భార్య హమీదాకు ఇలియాస్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. అడ్డుగా ఉన్న భర్తను తొలగించేందుకు ప్రియుడు ఇలియాస్, అతడి స్నేహితుడు వీరాంజనేయులుతో కలిసి పథకం ప్రకారం హత్యచేసి ప్రమాదవశాత్తూ మృతి చెందినట్లుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. హత్యానంతరం మృతదేహాన్ని పట్టణ సమీపంలోని కర్నూల బైపాస్ రోడ్డులోని బ్రిడ్జి కింద ఈనెల 14వ తేదీన పడవేశారు. హతుడి శరీరంపై గాయాలు ఉండటంతో మొదట అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లుగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. లోతైన విచారణ చే సిన పోలీసులు హతుడి భార్య హమీదాకు ఇలియా్‌సతో ఉన్న వివాహేతర సంబంఽధం ఉన్నట్లు గుర్తించారు. హమీదాకు ఉన్న అక్రమ సంబంధమే భర్త ఆరీఫ్ హత్యకు గురైనట్లు నిర్థారించిన పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వివాహేతర సంబంధమే ఆరీ్‌ఫను ప్రియుడు ఇలియాస్, వీరాంజనేయులుతో కలిసి భార్య మీద పక్కా ప్రణాళిక ప్రకారం హత్య చేసినట్లు మీడియాకు పోలీసులు వెల్లడించారు. కేసులో ప్రధాన నిందితుడు ఇలియాస్, అతడి స్నేహితుడు వీరాంజనేయులు, హతుడి భార్య హమీదాను పోలీసులు బుధవారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు వివరించారు.