Share News

జాతరలో అక్రమ వసూళ్లను అరికట్టాలి

ABN , Publish Date - Jan 17 , 2026 | 01:09 AM

నీల కంఠేశ్వర స్వామి జాతరలో వ్యాపారుల నుంచి అక్రమ వసూళ్లను అధికారులు అరికట్టాలని జన చేనేతసమాఖ్య నాయకులు శంకరన్న, నీలకంఠ కోరారు.

జాతరలో అక్రమ వసూళ్లను అరికట్టాలి
నిరసన వ్యక్తం చేస్తున్న సీపీఐ నాయకులు

ఎమ్మిగనూరు/రూరల్‌/టౌన, జనవరి 16(ఆంధ్రజ్యోతి): నీల కంఠేశ్వర స్వామి జాతరలో వ్యాపారుల నుంచి అక్రమ వసూళ్లను అధికారులు అరికట్టాలని జన చేనేతసమాఖ్య నాయకులు శంకరన్న, నీలకంఠ కోరారు. శుక్రవారం వారు విలేఖరులతో మాట్లాడుతూ గతంలో కూడా అక్రంగా వసూలు చేస్తున్నారని తెలిసి జాతరలో తిరిగి ప్రతిఏడాది ఎంత ఇస్తున్నారో ఆప్రకారం ఇవ్వాలని వ్యాపారులకు తెలియజేశామన్నారు. నీలకంఠేశ్వర స్వామి ఆలయం కుర్ణి కులస్తులది. ఈ సంఘం ఆధ్వర్యంలోనే గతంలో జాతర నిర్వహించేవారు. అయితే మాచాని నాగరాజు తానే జాతరను నిర్వహిస్తానని చెప్పి రికార్డులను తీసుకెళ్లారు. కానీ, నేడు ఖర్చులు అవుతున్నాయని, అక్రమ వసూళ్లతో ఆలయానికి చెడ్డపేరు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. జాతర జరిపేందుకు ఇబ్బందిగా ఉంటే కుర్ణిదైవాచారం సం ఘానికి అప్పజెప్పాలని సూచించారు. నీలకంఠేశ్వరస్వామి జాతరలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ పట్టణ కార్యదర్శి రంగన్న, జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్‌యాదవ్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం సీపీఐ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న మున్సి పల్‌ కమిషనర్‌ ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ నాయకు లు తిమ్మగురుడు, సమీఉల్లా, రాజీవ్‌, విజయేంద్ర, మల్లికార్జునగౌడ్‌, ఖాజా, ఇస్మాయిల్‌ పాల్గొన్నారు. అలాగే తేరుబజారులో అక్రమ వసూళ్లకు పాల్పడటం సరికాదని మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్య దర్శి దేవేంద్రబాబు అన్నారు. ఇది ఇలాగే కొనసాగితే పట్టణంలో జాతర సంస్కృతి నీరుగారే ప్రమాదం ఉందన్నారు.

Updated Date - Jan 17 , 2026 | 01:09 AM