Share News

ఐఐఐటీ డీఎం సేవలు అమోఘం

ABN , Publish Date - Feb 20 , 2026 | 11:17 PM

: కర్నూలు ఐఐఐటీ డీఎం అతి తక్కువ కాలంలోనే మౌలిక సదుపాయాలను స్థాపించిందని, త్వరలోనే దేశంలోనే ప్రముఖ విద్యాసంస్థల్లో ఒకటిగా అవతరిస్తుందని పూణె డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌ టెక్నాలజీ వైస్‌ చాన్స్‌లర్‌, డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ మాజీ జనరల్‌ డైరెక్టర్‌ డా. బీహెచ్‌వీఎస్‌ నారాయణమూర్తి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఐఐఐటీ డీఎం సేవలు అమోఘం

డా. బీహెచ్‌వీఎస్‌ నారాయణమూర్తి

కర్నూలు ఎడ్యుకేషన్‌, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): కర్నూలు ఐఐఐటీ డీఎం అతి తక్కువ కాలంలోనే మౌలిక సదుపాయాలను స్థాపించిందని, త్వరలోనే దేశంలోనే ప్రముఖ విద్యాసంస్థల్లో ఒకటిగా అవతరిస్తుందని పూణె డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌ టెక్నాలజీ వైస్‌ చాన్స్‌లర్‌, డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ మాజీ జనరల్‌ డైరెక్టర్‌ డా. బీహెచ్‌వీఎస్‌ నారాయణమూర్తి ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక జగన్నాథగట్టుపై ఉన్న ఐఐఐటీ డీఎం ప్రాంగణంలో స్థాపన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన పెరిగిన రక్షణ బడ్జెట్‌, రక్షణ పరికరాల తయారీ వల్ల భారతదేశం ప్రపంచంలో ఎదగడానికి మార్గం సుగమం అవుతున్నదని అన్నారు. అనంతరం పోస్టర్‌ ప్రజెంటేషన్‌, ఈవెంట్‌ వేడుకల్లో భాగంగా పోటీలు నిర్వహించారు. ఇందులో 39 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఐఐటీ డీఎం బోర్డు ఆఫ్‌ గవర్నర్స్‌ ప్రొ. విజయలక్ష్మి దేశమానే, ఐఐటీ డీఎం డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి, రిజిస్ర్టార్‌ కృష్ణయ్య, వివిద శాఖాల విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 20 , 2026 | 11:17 PM