విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించం
ABN , Publish Date - Jan 07 , 2026 | 12:06 AM
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించమని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి హెచ్చరించారు.
ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి
ప్యాపిలి, జనవరి 6(ఆంధ్రజ్యోతి): విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించమని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి హెచ్చరించారు. మంగళ వారం మండలంలోని బూరుగుల, రాచెర్ల, భోంచెర్వుపల్లి, మాధవరం గ్రామాల్లోని సచివాలయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగు లు సమయ పాలన పాటించాలన్నారు. వివిధ ప్రాంతాల్లో ఉంటూ విధులకు ఆలస్యంగా వస్తే సహించేది లేదన్నారు. గ్రామాల్లో తిరిగి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. తాగునీరు, పారిశుధ్యం వంటి సమస్యలు తలె త్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కోట్ల రికార్డులను పరిశీలించారు. అంతకు ముందుగా కోట్ల రాచెర్ల గ్రామం సమీపంలోని లక్ష్మీకంబగిరిస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సింగల్‌విండో అధ్యక్షుడు సీమ సుధాకర్‌రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు సుదర్శన పాల్గొన్నారు.