అంటు వ్యాధులను గుర్తించండి : డీఎంహెచ్‌ఓ
ABN , Publish Date - Sep 03 , 2026 | 11:56 PM
కీటక జనిత, అంటు వ్యాధులను గుర్తిస్తే ఆ సమాచారాన్ని ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్‌ఫర్మేషన్ ప్లాట్‌ఫాం యాప్ (ఐహెచ్‌ఐపీ)లో తప్పక నమోదు చేసి వివరాలు పంపించాలని డీఎంహెచ్‌వో డా.వై.కామేశ్వరప్రసాద్ ఆదేశించారు.
కర్నూలు హాస్పిటల్, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): కీటక జనిత, అంటు వ్యాధులను గుర్తిస్తే ఆ సమాచారాన్ని ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్‌ఫర్మేషన్ ప్లాట్‌ఫాం యాప్ (ఐహెచ్‌ఐపీ)లో తప్పక నమోదు చేసి వివరాలు పంపించాలని డీఎంహెచ్‌వో డా.వై.కామేశ్వరప్రసాద్ ఆదేశించారు. గురువారం జిల్లా వైద్యఆరోగ్య శాఖ కార్యాలయంలో పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ నెలవారి సమీక్షలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంటువ్యాధుల నిర్మూలన లక్ష్యంగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశారని, దీని ద్వారా అంటు వ్యాధులను నిర్మూలించవచ్చని అన్నారు. ఈ వ్యాధులను గుర్తించిన ఆయా ప్రాంతాల వైద్యులు ప్రభుత్వానికి సమాచారం ఇస్తే సత్వర నిరోధక చర్యలు చేపట్టవచ్చన్నారు. వ్యాధి నిర్ధారణకు సంబంధించిన రిపోర్టులు ఆన్‌లైన్‌లో తప్పక పంపించాలని, అలా చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమీక్షలో లెప్రసీ, న్యూక్లియర్ మెడికల్ ఆఫీసర్ డా.మల్లికార్జున రెడ్డి, జిల్లా మలేరియా అధికారి వెంకటేశ్వర్లు, ఎపిడమాలజిస్టు వేణుగోపాల్‌యాదవ్, ల్యాబ్ టెక్నీషియన్లు, ప్రొజెక్షనిస్టు ఖలీల్ పాల్గొన్నారు.