Share News

ఆదర్శం.. జగ్జీవన్‌ రామ్‌ జీవితం

ABN , Publish Date - Apr 05 , 2026 | 11:35 PM

బాబు జగ్జీవన్‌ రామ్‌ జీవితం అందరికీ ఆదర్శనీయమని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ అన్నారు.

ఆదర్శం.. జగ్జీవన్‌ రామ్‌ జీవితం
జగ్జీవన్‌ రామ్‌ విగ్రహానికి నివాళులర్పిస్తున్న మంత్రి టీజీ భరత్‌

పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌

కర్నూలు అర్బన్‌, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): బాబు జగ్జీవన్‌ రామ్‌ జీవితం అందరికీ ఆదర్శనీయమని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ అన్నారు. ఆదివారం జగ్జీవన్‌ రామ్‌ జయంతి వేడుకల్లో భాగంగా నగరంలోని ఆర్‌ఎస్‌ రోడ్డు ఐదురోడ్ల కూడలిలో జగ్జీవన్‌ రామ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దళితుల ఆభ్యున్నతికి, సామాజిక న్యాయం కోసం ఆయన జీవితాన్ని అంకితం చేశార న్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన గొప్ప నాయకుడు బాబు జగ్జీవన్‌ రామ్‌ అన్నారు. మహనీయుల చరిత్ర యువతరం తెలుసుకోవాలని సూచించారు.

Updated Date - Apr 05 , 2026 | 11:35 PM