ప్రభుత్వంతో చర్చించి న్యాయం చేస్తా
ABN , Publish Date - Feb 23 , 2026 | 12:25 AM
గత వైసీపీ హాయంలో యూపీహెచ్‌సీ (ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం)లో పనిచేస్తు తొలగింపుకు గురైన ల్యాబ్‌టెక్నిషీయన్లు, ఫార్మాసిస్టులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, నర్సులకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వంతో చర్చిస్తానని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి తెలిపారు.
యూపీహెచ్‌సీ సిబ్బందికి ఎమ్మెల్యే బీవీ హామీ
ఎమ్మిగనూరు, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ హాయంలో యూపీహెచ్‌సీ (ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం)లో పనిచేస్తు తొలగింపుకు గురైన ల్యాబ్‌టెక్నిషీయన్లు, ఫార్మాసిస్టులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, నర్సులకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వంతో చర్చిస్తానని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే బీ ఇటీవల అసెంబ్లీలో తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెల్లడంతో ఆదివారం ఎమ్మెల్యే స్వగృహంలో సిబ్బంది అనిల్ కుమార్, రాజు, చరణ్, విజయమ్మ, రాధిక,ప్రేమ, రేవతి, అనంత్‌లు ఎమ్మెల్యే బీవీని సన్మానించారు. కరోనా సమయంలో సేవలందించి తొలగింపుకు గురైన ఉద్యోగుల తరుపున ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వైద్యశాఖ మంత్రితో చర్చించి న్యాయం జరిగేలా చూస్తానన్నారు.
సూక్ష్మ నాటికల్ నాట్ బోర్డును తయారు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్న సూక్ష్మ కళాకారుడు శివకేశను ఎమ్మెల్యే సన్మానించారు. శివన్న నగర్‌కు చేనేకుటుంబానికి చెందిన మాచాని గంగాధర్, లలిత కుమారుడు శివకేశవ గిన్నిస్ వరల్డ్ రికార్డులో పేరుదక్కించుకోవటం అభినందనీయమన్నారు. పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఎంబీ మహేష్, రామకృష్ణ నాయుడు, రాజులు పాల్గొన్నారు.