రూ.50వేల కోట్ల పెట్టుబడులు తెస్తా
ABN , Publish Date - Jan 11 , 2026 | 11:57 PM
: ఓర్వకల్లు ఇండస్ట్రీయల్ కారిడార్‌కు రూ.50 వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు.
పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్
కర్నూలు అర్బన్/స్పోర్ట్స్, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): ఓర్వకల్లు ఇండస్ట్రీయల్ కారిడార్‌కు రూ.50 వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. ఆదివారం నగరంలోని సెయింట్ జోసెఫ్స్ డిగ్రీ కళాశాలలో వాసవీ ప్రీమియర్ లీగ్-0 క్రికెట్ పోటీల ముగింపు వేడుకలకు ముఖ్య అతిఽధిగా హజరయ్యారు. కర్నూలులో మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పోటీలు నిర్వహించేలా కృషి చేయాలని కోరారు. కర్నూలు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. కర్నూలులో అందుబాటులో లేరని ఎవరైనా తన గురించి అడిగితే మంత్రిగా ఇతర ప్రాంతాలు, దేశాలు తిరిగి పని చేయాలని చెప్పాలని సూచించారు. తాను ఎక్కడా ఉన్నా కర్నూలు ప్రజలకు సేవ చేసేందుకు నిత్యం ఆలోచిస్తుంటానన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు సుధీర్, శ్రీకాంత్, క్రీడాకారులు పాల్గొన్నారు.