వ్యవసాయ మార్కెట్‌కు భారీగా వేరుశనగ
ABN , Publish Date - Jul 26 , 2026 | 11:49 PM
ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్‌కు పంట ఉత్పత్తులు భారీగా వచ్చాయి. ఆదివారం ఎమ్మిగనూరు నుంచే ఇతర ప్రాంతాల నుంచి భారీగా వేరుశనగను విక్రయించేందుకు రైతులు తీసుకొచ్చారు.
17,977 బస్తాలు రాక, గరిష్ఠ ధర రూ.8,400
ఎమ్మిగనూరు, జూలై 26 (ఆంధ్రజ్యోతి) : ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్‌కు పంట ఉత్పత్తులు భారీగా వచ్చాయి. ఆదివారం ఎమ్మిగనూరు నుంచే ఇతర ప్రాంతాల నుంచి భారీగా వేరుశనగను విక్రయించేందుకు రైతులు తీసుకొచ్చారు. దీంతో మార్కెట్‌లో ఎక్కడ చూసినా వేరుశనగ రాసులు కనిపించాయి. మార్కెట్‌కు 489 మంది రైతులు 17,977 బసాలు (5393 క్వింటాళ్లు) వేరుశనగ అమ్మకానికి తీసుకొచ్చారు. ఆదివారం మార్కెట్‌లో వేరుశన క్వింటా కనిష్ట ధర రూ.3,060, మధ్య ధర రూ.5,839, గరిష్ట ధర రూ.8,400 చొప్పున పలికాయి.