Share News

స్ట్రెచర్లు లేకపోతే ఎలా?

ABN , Publish Date - Jan 06 , 2026 | 01:26 AM

అత్యవసర పరిస్థితుల్లో, పరీక్షలకు తీసుకెళ్లేందుకు స్ట్రెచర్లు ఇవ్వకుంటే రోగులను ఎలా తరలించాలని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్ట్రెచర్లు లేకపోతే ఎలా?
క్యాజువాలిటీలో వాగ్వాదం చేస్తున్నరోగులు, సహాయకులు

నర్సింగ్‌ సిబ్బందితో రోగుల వాగ్వాదం

కర్నూలు హాస్పిటల్‌, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): అత్యవసర పరిస్థితుల్లో, పరీక్షలకు తీసుకెళ్లేందుకు స్ట్రెచర్లు ఇవ్వకుంటే రోగులను ఎలా తరలించాలని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం పెద్దాసుపత్రిలోని క్యాజువాలిటీ విభాగంలో నర్సింగ్‌ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఆసుపత్రికి గుండె కాయలాంటి క్యాజువాల్టీకి అత్యవసర వైద్యం కోసం రోగులు రోజుకు 300 నుంచి 400 మంది వస్తుంటారు. అయితే ఇక్కడ కేవలం 4 వీల్‌ చైర్లు, 3 స్ట్రెచర్లు మాత్రమే ఉన్నాయి. దీంతో రోగులు, వారి సహాయకులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాద బాధితులను తలోపలికి తీసుకెళ్లేందుకు పరీక్షల కోసం న్యూడయాగ్నోస్టిక్‌ బ్లాక్‌, సిటీ, ఎంఆర్‌ఐ కేంద్రాలకు తీసుకెళ్లేందుకు ఇబ్బంది ఎదురరుకావడంతో రోగుల సహాయకులు నర్సింగ్‌ సిబ్బందితో వాగ్వావాదానికి దిగారు. గంటసేపు అవుతున్నా వీల్‌ చైర్‌గానీ, స్టెచ్చర్‌గానీ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పందించిననర్సింగ్‌ సిబ్బందిని ఒకేసారి ఇంతమందికి ఎలా ఇవ్వాలో తెలియడం లేదని సమాధానం చెప్పలేక ఇబ్బందులు పడ్డారు. ఇక్కడి ఇబ్బందులు గమనించి, ఆసుపత్రి అధికారులు అత్యవసర విభాగమైన క్యాజువాల్టీకి అదనంగా ఎంఎన్‌వోలు, వీల్‌చైర్లు, స్ట్రెచర్లను కేటాయించాలని, రోగులు వారి సహాయకులు కోరుతున్నారు.

Updated Date - Jan 06 , 2026 | 01:26 AM