Share News

హలో బాగున్నారా..?

ABN , Publish Date - Oct 22 , 2026 | 12:47 AM

హలో సార్‌ బాగున్నారా.. వదిన, పిల్లలు ఎలా ఉన్నారు? మన గ్రామానికి ఓటెయ్యడాని దయచేసి రండి.. ఇదీ గ్రామాల్లో అభ్యర్థుల నుంచి వెళుతున్న ఫోన్‌కాల్స్‌ వివరాలు. కొన్ని కారణాలతో ఊరికి దూరంగా ఉండి, ఒక్కడే ఓటు హక్కు ఉన్న ఓటర్ల వివరాలు సేకరిస్తున్న అభ్యర్థులు వారి ఫోన్‌నెంబర్లు తీసుకుని ప్రతి ఒక్కరినీ ఫోన్‌లో పలకరిస్తున్నారు.

హలో బాగున్నారా..?

ఓటెయ్యడానికి రండి..

వలస వెళ్లినవారికి ఫోన్‌ చేస్తున్న అభ్యర్థులు

చాగలమర్రి, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): హలో సార్‌ బాగున్నారా.. వదిన, పిల్లలు ఎలా ఉన్నారు? మన గ్రామానికి ఓటెయ్యడాని దయచేసి రండి.. ఇదీ గ్రామాల్లో అభ్యర్థుల నుంచి వెళుతున్న ఫోన్‌కాల్స్‌ వివరాలు. కొన్ని కారణాలతో ఊరికి దూరంగా ఉండి, ఒక్కడే ఓటు హక్కు ఉన్న ఓటర్ల వివరాలు సేకరిస్తున్న అభ్యర్థులు వారి ఫోన్‌నెంబర్లు తీసుకుని ప్రతి ఒక్కరినీ ఫోన్‌లో పలకరిస్తున్నారు.

పేరు పేరునా పలకరింపు..

ఇప్పటికే నామినేషన్లు వేస్తుండటంతో సర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేదిశగా పావులు కదుపుతున్నారు. ఇన్నాళ్లు ఎదురుపడినా పట్టించుకోని వారు సైతం ఇప్పుడు పనిగట్టుకొని ఫోన్‌ నంబర్లను సేకరించి వరుసపెట్టి ఫోన్‌ చేస్తున్నారు. ఈ పలకరింపులు వెనుక ఆప్యాయతకంటే ఓట్ల లెక్కలే ఉన్నాయన్న చర్చ మండలంలో జరుగుతోంది.

వలస వెళ్లినవారే టార్గెట్‌

చింతలచెరువు, పెద్దవంగలి, గొట్లూరు, చాగలమర్రి, చిన్నవంగలి, ముత్యాలపాడు, గొట్లూరు, పెద్దబోదనం గ్రామాల నుంచి పలువురు ఉపాధి కోసం విజయవాడ, హైదరాబాదు, బెంగుళూరు, తిరుపతి ప్రాంతాలకు వలస వెళ్లారు. కొందరు కుటుంబాలతో సహా అక్కడే నివసిస్తుండగా మరికొందరు కుటుంబసభ్యులను గ్రామాల్లోనే ఉంచి ఒక్కరే వెళ్లి పనిచేసుకుంటుఆన్నరు. వలస వెళ్లిన కుటుంబాల పరిస్థితులు, పిల్లల చదువులు, పెద్దలు ఎక్కడ ఉంటున్నారనే వివరాలను గతంలో పట్టించుకోని నాయకులు ఇప్పుడు ఆరా తీయడం ఆసక్తికరంగా మారింది

Updated Date - Oct 22 , 2026 | 12:47 AM