గృహ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్
ABN , Publish Date - Oct 13 , 2026 | 11:51 PM
గృహ నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా వేగవంతంగా పూర్తి చేసి, అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ సిరి అధికారులను ఆదేశించారు.
ఓర్వకల్లు, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): గృహ నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా వేగవంతంగా పూర్తి చేసి, అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ సిరి అధికారులను ఆదేశించారు. హుశేనాపురం గ్రామంలోని హౌసింగ్ లేఅవుట్‌లో వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న గృహాలను కలెక్టర్ తనిఖీ చేశారు. నిర్మాణ దశకు సంబంధించిన బిల్లుల సమర్పణ, ఆమోదం, చెల్లింపుల ప్రక్రియను సమీక్షించారు. సిమెం ట్, స్టీల్, ఇసుక, ఇటుకలు తదితర సామగ్రి, కూలీల ఖర్చులు, నిర్మాణానికి అవుతున్న వ్యయం వివరాలను స్థానికులు సంబంధిత వ్యక్తులను అడిగి తెలుసుకున్నారు. సదుపాయాల కల్పనలో జాప్యం లేకుండా చూసుకోవాలన్నారు. గృహ నిర్మాణ శాఖ పీడీ నరసింహారెడ్డి, తహసీల్దార్ విద్యాసాగర్, ఎంపీడీవో నాగ అనుసూయ, హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు.
పురోగతి సాధించాలి
కర్నూలు కలెక్టరేట్: జిల్లాలో వెనుకబడిన శాఖలు పురోగతి సాధించా లని కలెక్టర్ ఏ.సిరి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలోకి ఫర్ఫార్మెన్స ఇండికేటర్ అంశంపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గృహ నిర్మాణాలకు సంబంధించిన కేపీఐ సూచికల్లో జిల్లాకు మెరుగైన గ్రేడింగ్ సాధిం చేలా కృషి చేయాలని హౌసింగ్ పీడీని ఆదేశించారు. నవంబరు నెలాఖరులోగా కనీసం 3వేలు నిర్మాణాలు పూర్తి చేసి సీ -గ్రేడ్ నుంచి బీ-గ్రేడ్‌కు చేరుకోవాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.