Share News

గృహ నిర్మాణాన్ని వేగవంతం చేయాలి

ABN , Publish Date - Mar 06 , 2026 | 12:22 AM

గృహ నిర్మాణాలను వేగవం తం చేయాలని హౌసింగ్‌ పీడీ చిరంజీవి లబ్ధిదారులకు సూచించారు.

గృహ నిర్మాణాన్ని వేగవంతం చేయాలి
లబ్ధిదారులతో మాట్లాడుతున్న హౌసింగ్‌ పీడీ చిరంజీవి

హౌసింగ్‌ పీడీ చిరంజీవి

గూడూరు, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): గృహ నిర్మాణాలను వేగవం తం చేయాలని హౌసింగ్‌ పీడీ చిరంజీవి లబ్ధిదారులకు సూచించారు. గురువారం గూడూరులో గృహ నిర్మాణాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పీడీ చిరంజీవి మాట్లాడుతూ పీఎంవై 2.0 స్కీం కింద గూడూరు అర్బనలో 290 గృహాలు మంజూరు కాగా, ఒకోక్క గృహ నిర్మాణానికి రూ. 2లక్షల 50 వేలు బిల్లు రూపంలో లబ్ధిదారులకు అందిస్తామన్నారు. అలాగే పాత గృహ నిర్మాణాలకు సంబంధించి గూ డూరు అర్బన కింద 100 గృహాలు, రూరల్‌ కింద 68 గృహాలు మం జూరు కాగా, ఒకోక్క గృహ నిర్మాణానికి రూ.లక్ష 80వేలు అందిస్తా మన్నారు. వాటికి అదనంగా బీసీ, ఎస్సీ లబ్ధిదారులకు రూ.50 వేలు, ఎస్‌టీ లబ్ధిదారులకు రూ.75వేలు అందిస్తామన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆయన వెంట హౌసింగ్‌ డీఈ లాల్‌ కృష్ణయ్య, ఏఈ జమన్న వర్క్‌ఇనస్పెక్టర్‌ లక్ష్మణ్‌ రావు, సురేష్‌, ఆపరేటర్‌ వెంకటేశ్వర్లు ఉన్నారు.

Updated Date - Mar 06 , 2026 | 12:22 AM